Vijay Devarakonda : ఆ విషయంలో నాకు నేనే శిక్ష వేసుకున్నా

website 6tvnews template 2024 04 03T124151.134 Vijay Devarakonda : ఆ విషయంలో నాకు నేనే శిక్ష వేసుకున్నా

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)నటించిన ఫ్యామిలీ స్టార్ (Family Star) మూవీ ఏప్రిల్ 5న స్క్రీన్ మీదికి రాబోతోంది. పరశురామ్ (Parushuram) డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీలో విజయ్ కి జోడీగా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) నటించింది. పరశురామ్, విజయ్ కాంబోలో గతంలో గీత గోవిందం (Geetha Govindam)సినిమా రిలీజైంది. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ పై అదే టాక్ వినిపిస్తోంది.

సినిమా పక్కా హిట్ అని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు మేకర్స్. విజయ్ , మృణాల్ కూడా రంగంలోకి దిగి సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంటున్నారు. తాజాగా ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో విజయ్ తన కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

నాలో ఎలాంటి మార్పు లేదు..కానీ :

పూరిజగన్నాథ్‌ (Puri Jagannath) పాన్ ఇండియా లెవెల్ లో తీసిన‘లైగర్‌’(Liger) బాక్సాఫీస్‌ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. సినిమా రిలీజ్ సమయంలో విజయ్‌ మాటతీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై తాజాగా విజయ్ రియాక్ట్ అయ్యాడు…” లైగర్‌ సినిమాకు ముందు.. తర్వాత నాలో ఎలాంటి మార్పు రాలేదు.కాకపోతే ఒక విషయంలో చాలా కేర్ గా ఉంటున్నాను. సినిమా రిలీజ్ కు ముందే దాని రిజల్ట్ గురించి మాట్లాడకూడదని డిసైడ్ అయ్యాను.

అదే నాకు నేనే విధించుకున్న శిక్ష. ఇక ఫ్యామిలీ స్టార్ (Family Star) విషయానికి వస్తే, మనకు ఏ కష్టం వచ్చినా ధైర్యం చెప్పే వ్యక్తి ప్రతి ఫ్యామిలీలో ఉంటారు. ఆ ఒక్కరే ఫ్యామిలీ స్టార్‌. మా ఫ్యామిలీలో మా నాన్న ఫ్యామిలీ స్టార్ . పరుశురాం ఈ స్టోరీ చెప్పగానే నాకు మా నాన్నే గుర్తొచ్చారు. అందుకే నా క్యారెక్టర్ కి ఆయన పేరే పెట్టాం. ఎందుకంటే ఆ పేరు పెట్టుకుంటేనే ఎమోషన్స్‌ కరెక్ట్ గా వస్తాయనిపించింది. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అవుతుంది.”అని విజయ్‌ తెలిపాడు.

ఎప్పటికైనా రూ. 200 కోట్ల సాధిస్తా :

గీతగోవిందం(Geetha Govindam) తర్వాత దాని కలెక్షన్లను బీట్ చేసే సినిమా రాలేదు. లైగర్ టైంలో రూ. 200 కోట్లకు పైగానే కలెక్షన్స్ వస్తాయని అనుకున్నా. కానీ అలా జరగలేదు. ఆ స్టేట్ మెంట్ వల్ల నాకు పొగరన్నారు. అయితే అది నా పొగరు కాదు. ఎదో ఒకరోజు రూ. 200 కోట్ల కలెక్షన్లు కచ్చితంగా సాధిస్తా. అని నా కాన్ఫిడెన్స్ . 200 కోట్లు కొడతా అనడం తప్పు కాదు.. అలా చెప్పి కొట్టకపోవడం నిజంగా నా తప్పే. దాని వల్లే ఎంతో మంది నన్ను తిట్టారు. అవమానించారు. అన్నీ భరించాను. ఎప్పటికైనా నా టార్గెట్ సాధిస్తా. రూ. 200 కోట్లు సాధించే వరకు ఎవరు ఎన్ని తిట్లు తిట్టినా పర్లేదు.” అని విజయ్ స్టేట్మెంట్ ఇచ్చాడు.

Leave a Comment