టాలీవుడ్ లో ప్రియమణి అంటే తెలియని వారు ఉండరు. తెలుగు లో దాదాపు అందరి హిరో లతో యాక్ట్ చేసింది ఈ అమ్మడు.
తను నటించిన ఆర్టికల్ 370 మూవీ ట్రైలర్ ఓపెన్ ఫంక్షన్ లో కార్యక్రమం లో ఒక పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు రకాల ఆసక్తి విషయాలు చెప్పుకొచ్చింది. ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు మీరు ఈ మధ్యన అన్ని ఐటెం సాంగ్స్ చేస్తున్నారు ఎందుకని అవకాశాలు రాకనా అని అడిగితే అదేం లేదు నాకు బాగానే అవకాశాలు వస్తున్నాయి ఎందుచేత అన్ని ఐటెం సాంగ్స్ అడుగుతున్నారు అంటే ఈ మధ్యన నేను ఎక్కువ హిందీ సినిమాలలో ఐటెం సాంగ్స్ చేస్తున్నాను అందుకనే అందరు అలా చెయ్యమని అడుగుతున్నారు అని చెప్పింది.
అప్పుడు ఆ విలేఖరి అప్పుడే నేను ఐటెం సాంగ్ చెయ్యను అని ఎందుకు చెప్పలేదు అని అడిగితే, దానికి సమాధానం గా నాకు షారుఖ్ ఖాన్ అంటే చాల ఇష్టం అందుకనే ఆయన అడగగానే ఒప్పేసుకున్నాను, అలా చెయ్యడం వల్ల నాకు మంచి గుర్తింపు వచ్చింది కూడా అని చెప్పింది.
అసలు మీకు ఆ అవకాశం ఎలా వచ్చింది అడుగగా – నేను చెన్నై లో డాన్సు పెర్ఫార్మెన్స్ ఇచ్చినపుడు అక్కడ ఆ సమయం లో రోహిత్ శెట్టి, షారుఖ్ ఖాన్ అక్కడే ఉన్నారుట, అప్పుడు నా డాన్సు చూసి తమని కలవడానికి ఒకసారి రా గలరా ఒక మూవీ గురించి డిస్కస్ చేద్దాం అని అడిగారు, అప్పుడు షారుఖ్ మీద ఉన్న ఇష్టం తో వెంటనే బొంబాయి వెళ్ళి కలిసాను అని అప్పుడు చెన్నై ఎక్స్ ప్రెస్ లో నటించే అవకాశం వచ్చింది అని చెప్పింది.
ఆ తర్వాత నాకు చాల ఐటెం సాంగ్స్ చెయ్యమని అడిగారని దానికి నేను సున్నితం గా తిరస్కరించానని అని చెప్పింది. నా మీద ఉన్న గౌరవం తో మరొక సారి షారుఖ్ ఖాన్ తో నటించే అవకాశం అలాగే మెయిన్ రోల్ రావడం తో జవాన్ సినిమాలో అవకాశం వచ్చింది అని చెప్పింది.
అయితే ఇప్పటికి బాలీవుడ్ నుండి చాల అవకాశాలు వస్తున్నాయని డేట్స్ లేకపోవడమో లేక కధ నచ్చక పోవడమో కొన్ని వదులుకున్నాను. మంచి కారెక్టర్ లు అయితే తప్పకుండా చేస్తానని అని చెప్పింది. తాను ఇప్పుడిప్పుడే తెలుగు లో అవకాశాలు బాగానే వస్తున్నాయని ముఖ్యం గా వెబ్ సీరిస్ చెయ్యమని అవి కూడా నచ్చితే తప్పకుండ చేస్తాను అని చెప్పుకొచ్చింది. మరి చూద్దాం ఈ అమ్మడు కి సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో.