Ranbir Kapoor: మా అమ్మ నగలు అమ్మి ఆ పని చేశాను : రణ్‎బీర్

WhatsApp Image 2024 04 01 at 10.49.01 AM Ranbir Kapoor: మా అమ్మ నగలు అమ్మి ఆ పని చేశాను : రణ్‎బీర్

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‎బీర్ కపూర్ (Ranbir Kapoor) యానిమల్ (Animal) సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను సైతం గెలుచుకున్నాడు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ వంగ (Sandeep Vanga) రూపొందించిన ఈ యాక్షన్ మూవాతో రణ్‎బీర్ లవర్ ఇమేజ్ కాస్త మారిపోయింది. అటు హిందీలో ఇటు తెలుగులో యానిమల్ సినిమా వసూళ్ల వర్షాన్ని కురిపించింది. ఈ సినిమా హిట్ తో ఇప్పుడు రణ్‎బీర్ సందీప్ తోనే యానిమల్ పార్క్ చేస్తున్నాడు.

ఈ మూవీతో పాటే వరుసగా పలు ప్రాజెక్టులు చేస్తున్నాడు. ఓ వైపు సినిమాలతో పాటు మరోవైపు టీవీ షోస్ లోనూ పాల్గొంటున్నాడు. తాజాగా కపిల్ శర్మ (Kapil Sharma)యాంకరింగ్ చేస్తున్న షో లో తన పర్సనల్ విషయాలను పంచుకుని అందరినీ అవాక్కు చేశాడు రణ్‎బీర్ . ఆలియా భట్ (Aliya Bhatt)తో పెళ్లి కి ముందు తన గర్ల్ ఫ్రెండ్స్ కు గిఫ్టులు ఇచ్చేందుకు ఎలాంటి పనులు చేసేవాడో చొప్పుకొచ్చాడు. ప్రస్తుతం రణ్‏బీర్ ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

బాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్స్ లో ఒకరు రణ్‎బీర్ కపూర్ (Ranbir Kapoor)అలియా భట్ (Aliya Bhatt)ఒకరు. వీళ్లిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అలియా కంటే ముందు రణ్‎బీర్ బాలీవుడ్ బ్యూటీ క్వీన్స్ దీపికా పదుకొనె (Deepika Padukone),కత్రినా కైఫ్ (Katrina Kaif)లతో ప్రేమాయణం సాగించాడు. అప్పట్లో వీరి అఫైర్స్ బాలీవుడ్ లో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. అయితే వారిద్దరితో బ్రేకప్ చేసుకున్నరణ్‎బీర్ కపూర్ 2022 లో అలియా ను ప్రేమ వివాహం చేసుకున్నాడు . ఈ క్యూట్ కపుల్ కు ఓ క్యూట్ పాప కూడా ఉంది.

WhatsApp Image 2024 04 01 at 10.48.30 AM Ranbir Kapoor: మా అమ్మ నగలు అమ్మి ఆ పని చేశాను : రణ్‎బీర్

ఈ చిన్నదానికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. రణబీర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. ఆలియా కూడా పలు ప్రాజెక్టుల్లో పనిచేస్తోంది. ఈ క్రమంలో రణబీర్ కపూర్ బాలీవుడ్ ప్రముఖ యాంకర్ కపిల్ శర్మ ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో లో గెస్టుగా హాజరయ్యాడు. తన పర్సనల్ విషయాలు చెప్పి ఫ్యాన్స్ ను అవాక్కు చేశాడు.

కపిల్ శర్మ (Kapil Sharma) చేసే షోకు బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. కపిల్ షో (Kapil Show)సూపర్ డూపర్ హిట్ అయ్యింది. బాలీవుడ్ లో ఏ సినిమా రిలీజవుతున్నా కపిల్ షోకు హాజరై ప్రమోషన్స్ చేయాల్సింది. తాజాగా ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో కు గెస్టుగా వచ్చిన రణ్ బీర్ కపూర్ , కపిల్ తో సరదాగా ముచ్చటించాడు. నీ పెళ్లిలో ఆలియా సిస్టర్స్, ఫ్రెండ్స్ కి బాగానే డబ్బులిచ్చావట? నీ చెప్పులు దాచిపెట్టి రూ.12 కోట్ల డిమాండ్‌ చేశారని తెలిసింది.

అది నిజమేనా.? అని కపిల్ అడగ్గా… నువ్వుతూ రణ్ బీర్ జవాబిచ్చాడు. మా పెళ్లి ఇంట్లోనే జరిగింది.. ఒకవేళ వాళ్లు నా చెప్పులు దాచిపెట్టినా అవి మా ఇంట్లోనే ఉంటాయి. అవి ఎక్కడికి పోవు అని సరదాగా ఆన్సరిచ్చాడు. దానికి కపిల్ రిప్లై ఇస్త..నా వివాహంలోనూ ఇదే జరిగింది. చెప్పు దాచి రూ. 11 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దానికి నేను మీ చెల్లితో పాటు ఆ చెప్పులు మీరే ఉంచుకోండి అని చెప్పాను అని కామెడీ చేశాడు. ఇదే క్రమంలో రణ్‎బీర్ కపూర్ మాట్లాడుతూ.. అప్పట్లో నా గర్ల్ ఫ్రెండ్స్ కు గిఫ్ట్స్ కోసం మా అమ్మ అమ్మేవాడినని చెప్పి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ కామెంట్స్ చూసిన జనం అవునా నిజమా అంటూ నోరెళ్లబెడుతున్నారు.

Leave a Comment