Manchu Lakshmi :నా కూతురికి సాక్స్ కోసం అమెరికా వెళ్తాను..మంచు లక్ష్మి.
మంచు లక్ష్మి ఈ పేరుకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు కూతురు. ఆయన స్టార్డమ్ ను ఉపయోగించుకొని టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది లక్ష్మి.
సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఇండస్ట్రీ లక్ష్మికి పెద్దగా కలిసి రాలేదని టాక్. చాలా వరకు సినిమాలో నటించినప్పటికీ అనుకున్నంత హిట్స్ అందుకోలేకపోయింది.
వెండితెర మీద వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూనే వీలు కుదిరినప్పుడల్లా బుల్లితెర పైన వివిధ షోలతో అలరిస్తూ ఉంటుంది మంచి లక్ష్మి. ఒకరకంగా చెప్పాలంటే మంచు లక్ష్మి మల్టీ టాలెంటెడ్.
నటిగా దర్శకురాలిగా నిర్మాతగా ఇలా చాలా రంగాల్లో ఈమెకు మంచి ప్రతిభ ఉంది. సోషల్ మీడియాలోనూ మంచు లక్ష్మికి మంచి ఫాలోయింగ్ ఉంది.
సొంతంగా యూట్యూబ్ ఛానల్ నడిపిస్తూ తన పర్సనల్ విషయాలను, ప్రొఫెషనల్ సంగతులను షేర్ చేస్తూ ఉంటుంది. మంచు లక్ష్మి కి ఒక పాప ఉన్న సంగతి తెలిసిందే.
ఆ పాప అంటే ఆమెకు ఎంతో ఇష్టం. తన కూతురు గురించి సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పుడు చెబుతూనే ఉంటుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం మంచు మోహన్ బాబు హైదరాబాదద్ లోనే ఉంటున్నారు. నిన్నమొన్నటి వరకు మంచు లక్ష్మి కూడా ఇక్కడే ఉండేది. కానీ, ప్రస్తుతం మంచు లక్ష్మి ముంబైలోనే సెటిల్ అయ్యింది.
అయితే హైదరాబాద్ నుంచి ముంబైకి రావడానికి గల కారణాలను తాజాగా ఓ ఈవెంట్లో తెలిపింది.” నా పాపకి ఏదైనా నా తరఫున చేయాలనుకుంటే ఇదే సరైన సమయం. అందుకే నేను ముంబై వచ్చాను.
మా పాప ఇక్కడే చదువుకుంటోంది. ముంబై నుంచి హైదరాబాద్ పెద్దగా దూరం కాదు. ఒక్క గంటలో వెళ్లిపోవచ్చు. కానీ నా పాపం స్టడీస్ పూర్తయిన తర్వాతే హైదరాబాద్ వస్తాను.
నేను నా కూతురు విషయంలో అసలు కాంప్రమైజ్ కాను. ఆమె షూస్ కి సాక్స్ కోనేందుకు నేను అమెరికా వెళ్తాను. ప్రతి సంవత్సరం అమెరికా వెళ్తాను . అప్పుడే నాకు, నా కూతురికి కావలసినవి తెచ్చుకుంటాను.
అలాగే నాన్న కోసం అమెరికాలోనే జ్యువలరీ ని కొని ఇండియా వచ్చాక బహుమతిగా ఇస్తాను.. ఆయనకు నగలు అంటే చాలా ఇష్టం. అందుకే నేను ఎక్కడికి వెళ్లినా తప్పనిసరిగా నగలు కొంటాను
అని మంచు లక్ష్మి తెలిపింది. ఇక దీనిని నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చెయ్యడం స్టార్ట్ చేశారు. పాప సాక్స్ కోసం అమెరికా వెళ్లడం మామూలు విషయం కాదు. అక్క రేంజే వేరంటూ కామెంట్లు చేస్తున్నారు.