Allu Arjun: అలాంటివి నేను చెయ్యను..చెప్పేసిన ఐకానిక్ స్టార్.

Untitled design Allu Arjun: అలాంటివి నేను చెయ్యను..చెప్పేసిన ఐకానిక్ స్టార్.

Allu Arjun: అలాంటివి నేను చెయ్యను..చెప్పేసిన ఐకానిక్ స్టార్.

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నుంచి సాలిడ్ అప్‌డేట్ వచ్చి చాలా రోజులే అవుతోంది. పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిన బన్నీ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది.

అందుకే పుష్ప 2 మూవీ విడుదలకు ఆలస్యమవుతోందని సమాచారం. అందుకే సోషల్ మీడియాలో బన్నీకి సంబంధించిన అప్‎డేట్స్ కాస్త తక్కువగా కనిపిస్తున్నాయి.

ఈ గ్యాప్‌ను పూర్తి చేయాలనే ఉద్దేశంతో పుష్ప రిలీజ్‌ యానివర్సరీని అంగరంగవైభవంగా సెలబ్రేట్ చేశారు బన్నీ ఫ్యాన్స్. స్టైలిష్ స్టార్‌గా ఉన్న బన్నీని ఐకాన్‌ స్టార్‌గా మార్చిన మూవీ పుష్ప.

ఈ మూవీ సాలిడ్ హిట్ తో నేషనల్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు పుష్పరాజ్‌. తొలి అడుగులోనే సెన్సేషన్ సృష్టించాడు. దాదాపు అన్ని భాషల్లోనూ పుష్ప సినిమా రికార్డుల మోత మోగించింది.

భారీ వసూళ్లతో బాక్సాఫీస్‌ను బద్దలుకొట్టింది. ఈ మూవీ బన్నీ అభిమానులకు ఎన్నో మెమరబుల్‌ రికార్డ్‌లను అందించింది. అందుకే ఈ మూవీ వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇంకా ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ కొనసాగిస్తూనే ఉన్నారు.

అల్లు అర్జున్(Allu Arjun) తన కెరీర్‌లో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తుంటాడు. మొదటి సినిమా గంగోత్రి కాస్త అటు ఇటు అయినా కూడా ఆ మూవీ నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకుని తనను తాను మార్చుకుని నటనలో మరింత నైపుణ్యాన్ని నేర్చుకుని నేడు ఐకానిక్ స్టార్ అయ్యాడు బన్నీ.

అల్లు అర్జున్(Allu Arjun) నటించే ప్రతి సినిమాలో కొత్తదనం ఉంటుంది. తన పాత్రలోనూ కొత్తదనం చూపించేందుకు తెగ ట్రై చేస్తుంటాడు బన్నీ. తనని చూసి ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవ్వాలనుకుంటాడు.

Add a heading 2023 12 19T103417.480 Allu Arjun: అలాంటివి నేను చెయ్యను..చెప్పేసిన ఐకానిక్ స్టార్.

అందుకే ప్రతి క్యారెక్టర్‎ను ఎంతో స్పెషల్‎గా కేర్‎గా చేస్తుంటాడు. అంత ప్లాన్డ్ గా ఉన్నాడు కాబట్టే పుష్ప సినిమా ఇండియాను షేక్ చేసింది. నిజానికి ఈ మూవీ బన్నీకి చాలా స్పెషల్‌.

ఇది తన కెరీర్‌లోనే ఫస్ట్ పాన్ ఇండియా సినిమా మాత్రమే కాదు… వసూళ్ల పరంగా, ఓటీటీ వ్యూస్‌ పరంగా, యూట్యూబ్ రికార్డ్స్ పరంగా అల్లు అర్జున్‏ను ది బెస్ట్‌‎గా నిలబెట్టింది.

అందుకే ఈ సినిమా విజయాన్ని ఇప్పటికీ సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు అభిమానులు. ఈ క్రమంలో పుష్ప 2 మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

సుకుమార్ టీమ్ కూడా అభిమానుల అంచనాలను ఏమాత్రం తగ్గకుండా ఓ రేంజ్‌ కంటెంట్‌ను రెడీ చేస్తోంది. ఇప్పటికే సెట్స్ మీద ఉన్న పుష్ప 2 వచ్చే సంవత్సరం ఆగస్టులో విడుదలకు సిద్ధం అవుతోంది.

సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండటంతో పుష్ప పార్ట్ వన్‌ మెమరీస్‌తోనే టైమ్ ఫాస్ చేస్తున్నారు బన్నీ అభిమానులు. సినిమా అప్‌డేట్స్‌ లేకపోయినా ఎదో ఒక రకంగా బన్నీ పేరును ట్రెండ్‌లో ఉంచేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే రీసెంట్‎గా బన్నీ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలియజేశాడు. పుష్పాతో బన్నీకి వచ్చిన ఫేమ్ దృష్ట్యా ఓ పాన్ మసాలా బ్రాండ్‏కు తనను నటించమని అడిగారట.

అయితే అల్లు అర్జున్(Allu Arjun) మాత్రం అందుకు నో చెప్పారని ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ వార్త ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

ఈ యాడ్ కోసం నిర్మాతలు ఏకంగా బన్నీకి పది కోట్లు ఆఫర్‌ అనౌన్స్ చేశారట. అయినా బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌కు బన్నీ నో చెప్పారని టాక్ వినిపిస్తోంది.

ఇలాంటివి అసలు తనను చేయనని తేల్చి చెప్పేశాడట. దీంతో ఈ న్యూస్‌ వైరల్‌ కావటంతో బన్నీ ఆర్మీ చాలా గర్వంగా కాలర్‌ ఎగరేస్తోందట. బన్నీ మంచి నిర్ణయం తీసుకున్నాడని తెగ పొగిడేస్తున్నారని సమాచారం.

Leave a Comment