Amrapali Kata IAS: డిప్యుటేషన్ పూర్తి చేసుకున్న ఐఏఎస్ ఆమ్రపాలి..తెలంగాణ ప్రభుత్వంలోకి అవకాశం.
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, భారత ప్రభుత్వ ప్రీమియర్ పరిపాలనా పౌర సేవ ను ఐఏఎస్ అంటారు, వీరి విధులు చాలా కీలకం. అందుకే ఏ ప్రభుత్వం లోని నాయకులైనా వారికి అనుకూలంగా ఉండే ఐఏఎస్ ఆఫీసర్లను ఏరికోరి తమ ప్రభుత్వం లో పెట్టుకుంటారు.
కొత్తవారిని తీసుకొచ్చి పెట్టుకోవాలంటే పాతవారిని మార్చక తప్పదు. అందుకే ప్రభుత్వాలు మారిన అనేక సందర్భాలలో అధికారుల బదిలీలు కూడా జరిగాయి.
తాజాగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలుదీరిన సందర్భంగా కూడా కొంత మంది అధికారుకు బదిలీలు తప్పవనే మాట వినిపిస్తోంది.
రేవంత్ రెడ్డి సీఎం గా అధికార పగ్గాలు చేపట్టాక ఐదుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడమే కాక హైదరాబాద్ సిపిగా కొత్తకోట శ్రీనివాసరెడ్డిని కోరి నియమించుకున్నారు. ఇప్పిడు మరో అధికారికి సంబంధించిన వార్త హల్చల్ చేస్తోంది.
డైనమిక్ ఆఫీసర్‌గా పేరు గడించిన ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తో కలిసి పనిచేస్తారని టాక్ బలంగా వినిపిస్తోంది.
ఈ మధ్య కాలం వరకు ఆమ్రపాలి కేంద్రంలోని ప్రధాన మంత్రి కాయలయం లో పనిచేశారు. అక్కడ ఆమె డిప్యూటీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిచారు. డిప్యుటేషన్ మీద ఏ అధికారికైనా ఆలా వెళ్లడం తప్పనిసరే, అదే క్రమం లో ఆమ్రపాలి కూడా కేంద్రం నుండి పిలుపు రావడంతో తప్పనిసరి అయ్యి వెళ్ళారు.
అయితే రెండు సంవత్సరాల డిప్యుటేషన్ ను పూర్తి చేసుకున్న ఆమ్రపాలి హైదరాబాద్ కు చేరుకున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో ఆమె మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు.
అయితే బయట టాక్ మాత్రం మరోలా ఉంది, ఆమ్రపాలి సీఎం రేవంత్ రెడ్డిని కలడం చుస్తే రేవంత్ టీమ్ లో ఆమెకు చోటు దక్కడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే అని భావిస్తున్నారు.
అందుకు కారణం కూడా లేకపోలేదు, ఇప్పటికే సీఎస్ శాంతి కుమారి తో సీఎం రేవంత్ అధికారుల బదిలీల గురించి చర్చించినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ సమయం లోనైనా ఏ ఐఏఎస్ ఆఫీసర్ అయినా బదిలీ అయ్యే ఛాన్స్ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక గతంలో చుస్తే కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు స్మిత సబర్వాల్ ఆయన టీమ్ లో వర్క్ చేసేవారు. బి.ఆర్.ఎస్ గవర్నమెంట్ లో ఆమె చాలా కీలకంగా వ్యవహరించేవారు.
ఇక ఆమ్రపాలి కూడా స్మిత సబర్వాల్ మడిగా డేరింగ్ అండ్ డాషింగ్ ఆఫీసర్ కాబట్టి రేవంత్ రెడ్డి ఆమెను తమ టీమ్ లో యాడ్ చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారని సమాచారం.
ఇక ఆమ్రపాలి గురించి చుస్తే ఆమె ఆంధ్ర ప్రదేశ్ క్యాడర్ కి చెందిన అధికారిణి, కానీ రాష్ట్ర విభజన అనంతరం ఆమ్రపాలి వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిచారు.
జీహెచ్ ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా పనిచేసినా, ఆతరువాత 2018లో తెలంగాణ ఎన్నికల సంయుక్త ప్రధానాధికారిగా పనిచేసిన తనదైన శైలిలో పనిచేయడం మాత్రం మానలేదు.
ఆమె ఎక్కడ ఉన్నా పనిలో మాత్రం తనడైన ముద్రను వేసుకోవడంతో వెనక్కి తగ్గలేదు. అందుకె డేరింగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు.