Allu Arjun: అల్లు అర్జున్ సెన్సేష‌న‌ల్ రికార్డ్…సౌత్‎లోనే ఫస్ట్ టైమ్

website 6tvnews template 2024 03 21T112640.876 Allu Arjun: అల్లు అర్జున్ సెన్సేష‌న‌ల్ రికార్డ్…సౌత్‎లోనే ఫస్ట్ టైమ్

ఐకాన్ స్టార్ (Iconic sta) అల్లు అర్జున్ (Allu Arjun)పుష్ప (Pushpa)సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. రెడ్ సాండెల్ స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ సౌత్ టు నార్త్ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమాలో బన్నీ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ కు గాను నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు .

ఈ సినిమాతో బాలీవుడ్ లోనూ తన క్రేజ్ ను అమాంతం పెంచేసుకున్నాడు. వెండితెరమీదే కాదు సోషల్ మీడియాలోనూ బన్నీకి ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. అందుకుతగ్గట్లుగానే బన్నీ తన పర్సనల్, ప్రొఫెషనల్ వీడియోలను , ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటాడు. ఈ క్రమంలో తాజాగా మరో రికార్డును అల్లు అర్జున్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో 25 మిలియ‌న్ల ఫాలోవ‌ర్ల‌ు :

అల్లు అర్జున్ (Allu Arjun)సరికొత్త రికార్డుతో మరోసారి ట్రెండింగ్ లో నిలిచాడు. సౌత్ ఇండియాలో సెన్సేష‌న‌ల్ స్టార్ గా రికార్డు సాధించాడు. లేటెస్టుగా బ‌న్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో 25 మిలియ‌న్ల ఫాలోవ‌ర్ల‌ను సొంతం చేసుకున్నాడు. ఇంత పెద్ద సంఖ్యలో ఫాలోవ‌ర్లు ఉన్న ఫస్ట్ సౌత్ యాక్టర్ గా బన్నీ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఐకాన్ స్టార్ తర్వాత లైనప్ లో ఉన్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Devarakonda). రౌడీ బాయ్ కి ఇన్‌స్టాగ్రామ్‌లో 21.3 మిలియ‌న్ల ఫాలోవర్స్ ఉన్నారు.

రామ్ చ‌ర‌ణ్ (Ramcharan)కు 20.8 మిలియ‌న్లు, దుల్క‌ర్ స‌ల్మాన్ (Dulkar Salman) కు 14.1 మిలియ‌న్లు ,సెన్సేషనల్ స్టార్ య‌శ్(Yash) కు 13.5 మిలియ‌న్లు, సూపర్ స్టార్ మ‌హేశ్ బాబు (Mahesh Babu)కు 13.4 మిలియ‌న్లు, డార్లింగ్ ప్రభాస్ (Prabhas) కు 11.7 మిలియ‌న్లు, తమిళ సూపర్ స్టార్ ద‌ళ‌ప‌తి విజ‌య్ (Thalapathy)కి 10.8 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లు ఉన్నారు. దక్షిణ స్టార్ హీరోల లిస్టులో సోషల్ మీడియాలో అగ్రస్థానంలో బన్నీ ఉండటంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.

పుష్ప2 కోసం ఫ్యాన్స్ వెయిటింగ్ :

ప్రస్తుతం సుకుమార్ (Sukumar) ద‌ర్శ‌క‌త్వంలో అల్లుఅర్జున్ నటిస్తున్న పుష్ప2 (Pushpa2)విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక మందన్న(Rahsmika Mandanna) హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతోంది. అనుకున్న షెడ్యూల్ కు విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ మూవీని ఆగ‌స్టు 15న థియేట‌ర్ల‌లో రిలీజ్ రానుంది. ‘పుష్ప‌-2’ త‌ర్వాత బన్నీ త్రివిక్ర‌మ్‌ (Trivikram), సందీప్ రెడ్డి వంగ (Sandeep reddy vanga) సినిమాలు చేయబోతన్నాడని సమాచారం. అంతే కాదు ఇటీవల జవాన్ (Jawaan) సినిమాతో భారీ హిట్ సాధించిన తమిళ యువ డైరెక్టర్ అట్లీ (Atlee)తోనూ ఓ మూవీ ప్లాన్ చేస్తున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

Leave a Comment