నేను మీ ఇంటి పేరు మార్చుకుంటే అది నాదే అవుతుందా

website 6tvnews template 2024 04 02T121024.282 నేను మీ ఇంటి పేరు మార్చుకుంటే అది నాదే అవుతుందా

If I change your family name will it be mine – Jai Shankar’s comments on China : ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా చేసిన వాదనను భారత విదేశాంగ మంత్రి తీవ్రం గా విమర్శించారు. ఇక మీదట ఎప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యవద్దని కూడా సున్నితం గా హెచ్చరించారు.

భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రంలోని స్థలాల కోసం ఆ ప్రాంతం మాదే నంటు కొత్త పేర్ల జాబితాను విడుదల చేసిన అనంతరం ఎస్. జైశంకర్ బీజింగ్‌ను నిందించారు. జైశంకర్ మాట్లాడుతూ, అరుణాచల్ ప్రదేశ్ అనేది ఎప్పడు భారతదేశం యొక్క రాష్ట్రమే అని ఆయన అన్నారు.

ఒకవేళ నీ ఇంటి పేరు నేను పెట్టుకుంటే నీది నాది అవుతుందా అని వ్యగ్యం గా మాట్లాడారు. చైనీస్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అరుణాచల్ ప్రదేశ ప్రాంతం లో ఉన్న కొన్ని ప్రదేశాలకు ఇటీవల కొన్ని పేర్లను విడుదల చేసింది.

అరుణాచల్ ప్రదేశ్‌లో మార్చబడిన నాల్గవ జాబితాను విడుదల చేసిన తర్వాత ఇది జరిగింది, దీనిని “జాంగ్నాన్” మరియు దక్షిణ టిబెట్‌లో ఒక భాగం అని పిలుస్తుంది. చైనా ఎప్పటినుండో అరుణాచల్ ప్రదేశ్ మాదే అని వాదిస్తోంది. అది దక్షిణ టిబెట్ ప్రాంతం అని అది మాకే చెందుతుందని అంటోంది. దీనికి సంబందించి సరిహద్దుల వద్ద తరచు భారత సైనికులతో తరచూ గొడవలు పెట్టుకుంటోంది.

Leave a Comment