Rekha Bhoj’s sensational statement: భారత్ గెలుస్తే బట్టలిప్పేస్తా..రేఖా భోజ్ సంచలన ప్రకటన..
సినిమాల్లో అవకాశాలు లేక ఖాళీగా కూర్చున్న భామలు కొందరైతే, అవకాశాల కోసం ఎదురుచూసే భామలు మరి కొందరు, అయితే వీరిలో కొంతమంది మాత్రం వింతైన విచిత్రమైన స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. ఖాళీగా ఇంట్లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంటే ఇండస్ట్రీ తోపాటు ప్రేక్షకులు కూడా తమను బొత్తిగా మర్చిపోతారు అనుకుంటారేమో కానీ, అప్పుడుడప్పుడు కాస్త బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తూ వార్తల్లో హెడ్ లైన్స్ అవ్వాలని బాగా ట్రై చేస్తుంటారు. గతంలో కూడా పూనమ్ పాండే అనే మోడల్ కూడా సరిగ్గా ఇలానే చేసింది. కేవలం ఆమె మాత్రమే కాదు అనేక మంది నటీమణులు మోడల్స్ ఇలాంటి పైత్యాన్ని ప్రదర్శించారు.
అసలు ఇప్పుడేం జరిగింది, క్రేజీ స్టేట్మెంట్ ఇచ్చిన బ్యూటీ ఎవరు, ఇంతకి ఏమని చెప్పింది అనే కదా మీ డౌట్ ? అసలు విషయంలో కి వెళ్ళిపోదాం. రేఖా భోజ్ ఈవిడ ఒక తెలుగు నటి, ఒకటి అరా సినిమాల్లో నటించింది. ఆమె సొంత ఊరు వైజాగ్. ప్రస్తుతం ఆ అమ్మడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటంటే భారత క్రికెట్ జట్టు గనుక వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ లో నేగి కప్పును ముద్దాడితే, తాను విశాఖ బీచ్ లో బట్టలు లేకుండా తిరిగేస్తా అని చెప్పింది. అయ్యబాబోయ్ ఇదెక్కడి విపరీతం అనుకుంటున్నారా ? ఇది ఫారిన్ సంస్కృతీ, విదేశాల్లో కొంతమంది ఆనందం ఎగదన్నినప్పుడు, ఆ పట్టరాని సంతోషాన్ని వెల్లడి చేయడానికి బట్టలు లేకుండా నగ్నంగా రోడ్లపైకి వచ్చి పరుగులు పెడతారు. ఇలా చేయడాన్ని స్ట్రీకింగ్ అని పిలుస్తారు.
అయితే స్ట్రీకింగ్ చేయడం తప్పు కదా అని రేఖా భోజ్ ను ప్రశ్నిస్తే దానిని ఆమె సమర్ధించుకుంటోంది. క్రికెట్ అంటే తనకు ఒక ప్రత్యేకమైన ఎమోషన్ కాబట్టి, విప్పడంలో తప్పేం లేదని చెబుతోంది. మనస్పూర్తిగా ఇండియన్ క్రికెట్ మీద అభిమానంతో ఈ పని చేస్తున్నానే కానీ హైప్ కోసమో, ఫెమస్ అవ్వడం కోసమో కాదని చెబుతోంది. అయితే ఈ చిన్నది ఒకప్పుడు కాస్టింగ్ కౌచ్ కి సంబంధించి కూడా తన గొంతు బాగానే వినిపించింది. ఇక ఈ అమ్మడు కెరియర్ విషయానికి వస్తే దామినీ విల్లా, కాత్సాయని వంటి సినిమాల్లో నటించింది, ఆ సినిమాలు ఆమెకు ఏమాత్రం క్రేజ్ ని తెచ్చిపెట్టలేకపోయాయి. సరైన అవకాశాలు లేకపోవడంతో విశాఖపట్టణంలోని సొంతగా స్టూడియో ఏర్పాటు చేసుకుని కవర్ సాంగులు చేసుకుంటోంది. ఇక ఈ అమ్మడు విప్పుడు కార్యక్రమం చేపడతానని పేస్ బుక్ లో స్టేట్మెంట్ ఇవ్వగానే నెటిజన్లు చిలిపిగా కామెంట్లు పెడుతున్నారు. ఇండియా టీమ్ కోసం నువ్వు బట్టలు విప్పడానికి నువ్వు రెడీ అయితే నిన్ను చూడటం కోసం మేము వైజాగ్ రావడానికి రెడీ అని అంటున్నారు. తీరా ఇండియా గెలిచాక మాట మార్చావు కదా అని కొంటెగా కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. మరికొందరు మాత్రం బట్టలు లేకుండా బీచ్ లో పరిగెత్తడం ఏమిటి అని కామెంట్ చేస్తున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే ఈ వన్డే ప్రపంచ కప్ లో భారత్ ఓటమి అనేది లేకుండా అప్రతిహతంగా ముందుకు వెళుతోంది. సెమి ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై విజయం సాధించి ఫైనల్ లో బెర్తు కన్ఫర్మ్ చేసుకుంది. ఇక ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా జట్లు తలపడే మ్యాచ్ లో ఎవరైతే నెగ్గుతారో వారితో భారత్ ఫైనల్ లో ఆడనుంది. ఫైనల్ లో వారిని ఓడిస్తే కప్పు భారత్ జట్టు సొంతం అవుతుంది.