బల్లి మీద పడితే వెంటనే ఇలా చెయ్యండి! లేకపోతే ?

website 6tvnews template 2024 03 20T122233.704 బల్లి మీద పడితే వెంటనే ఇలా చెయ్యండి! లేకపోతే ?

If lizard fall on you do this immediately! If not? : మన శాస్త్రాల ప్రకారం జరిగే సంఘటనలు కొన్ని అశుభంగా కొన్ని శుభంగా చూస్తూ ఉంటాం. అందులో ఒకటి బల్లి మీద పడడం. మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మనకి ఎన్నో సంకేతాలను ఇస్తాయి అవి మంచివేనా చెడువైనా.

అయితే జరిగే సంఘటనను బట్టి అది మంచిదా చెడుదా అని మనమే నిర్ణయించుకోవాలి దీంట్లో ఎన్నో అపోహలు ఉన్నాయి చాలామందికి ఉన్నాయి. కొంతమందికి బల్లి మీద పడుతూ ఉంటుంది దీనివల్ల ఏం జరిగి ఏం జరుగుతుందో అని చాలామంది భయపడుతూ ఉంటారు ఎటువంటి అని అర్థం జరుగుతుంది మంచిదా కాదా అని ఆలోచిస్తూ ఉంటారు.

జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకుంటే అకస్మాత్తుగా కనుక బల్లి మీద పడటం అనేది సుఖసంకేతమే అని భావించాలి ఒక విధంగా బల్లులు చూసి భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే జ్యోతిష్యం ప్రకారం మళ్లీ మీద పడినప్పుడు భయపడాల్సిన అవసరం లేదని శాస్త్రంలో ఉందని పండితులను చెబుతున్నారు. బల్లి మీద పడడం వల్ల అది శుభసూచకం గాని భావించాలి ఏదో రూపంలో డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బల్లి మీద పడిన వాళ్ళకి సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.

కొంతమందికి బల్లి చేతి మీద పడుతూ ఉంటుంది అలా పడినప్పుడు అది మంచిదా కాదా? ఇలా పడటం అశుభమా శుభమా అని ఆలోచిస్తూ ఉంటారు. బల్లి కుడిచే మీద పడినట్లయితే డబ్బు సంపాదించబోతున్నారని ఒక సంకేతంగా భావించవచ్చు. ఒకవేళ బల్లి ఎడమ చేతి మీద పడినట్లయితే డబ్బును కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. బల్లులు అప్పుడప్పుడు మన పాదాల మీద పడడం కూడా జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏం జరుగుతుందా అని టెన్షన్ పడుతూ ఉంటారు. బల్లి కుడి కాలు, కుడి పాదం మీద పడితే ప్రయాణం చేసే అవకాశం ఉందని సంకేతంగా భావించాలి.

ఒకవేళ బల్లి ఎడమ కాలు మీద గాని ఎడమ పాదము మీద గాని పడితే దానిని అశుభం గా భావించాలి. ఇలా బల్లులు గడపకాల మీద పడినట్లయితే ఇంట్లో గొడవలు గాని బయట వాగ్వాదాలు జరగడం గానీ అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది అని పండితులు చెప్తున్నారు.

Leave a Comment