మోడీ పేరెత్తితే మీ భర్తలకు భోజనం పెట్టకుండా కడుపు మాడ్చాలని ఢిళ్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హిళలను కోరారు . మహిళల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం కొత్త పధకాలు ద్వారా వారి సాధికారత కోసం ఎంతో కృషి చేసిందని చెప్పారు. మహిళలు అందరు తమ కుటుంబసభ్యులతో కల్సి ఆప్‌కు ఓటు వేసేందుకు సహకరించాలి అని కోరారు.
శనివారం నాడు జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ పురుషులు మోడీ పేరు ను ఎక్కువగా కలవరిస్తున్నారని ఆయన విమర్శించారు. మీ భర్తలు ఇక మీదట మోడీ పేరెత్తితే వారికి అన్నం పెట్టద్దు అని చెప్పారు. మా ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్, ఉచిత బస్ టిక్కెట్లు ఇస్తున్న విషయాన్ని మీ భర్త లకు గుర్తు చేయాలని అయన విజ్ఞప్తి చేసారు. ఇప్పుడు మా ప్రభుత్వం 18 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ నెల నెలా రూ.1000 రూపాయలు ఆయన గుర్తు చేసారు.
కాని BJP ప్రభుత్వం లో మహిళా సాధికారత పేరిట దేశంలో ఎన్నో మోసాలు జరుగుతున్నాయని కేజ్రీవాల్ విమర్శించారు. ఇద్దరికో నలుగురికో మహిళలు ప్రయోజనాలు పొందితే మిగతా మహిళల పరిస్థితి ఏంటి అన్నదే మా ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాము. తాము ప్రవేశపెట్టిన కొత్త పథకం ” ముఖ్యమంత్రి మహిళా యోజన సమ్మాన్ ” తోనే మహిళల అందరికి నిజమైన సాధికారత వస్తుందని చెప్పారు.
ఒకవేళ శ్రీరాముడు ఈ కాలంలో జీవించి వుంటే కనక తమ పార్టీలో చేరమని BJP నేతలు ఒత్తిడి తెచ్చేవారని అందుకు శ్రీరాముడు నిరాకరించివుంటే ఆయన మీద కూడా ED, CBI ల చేత రైడ్ లు చేయించేవారని కేజ్రివాల్ విమర్శించారు. ED అధికారులు తనకు 8 సమన్లు పంపించడంపై ఆయన తీవ్రం గా స్పందించారు. తాను ఒక పెద్ద ఉగ్రవాదిని అన్నట్లు ED అధికారులు పదే పదే నాకు సమన్లు పంపిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అంతే కాదు తనను జైలుకు పంపి తమ ప్రభుత్వాన్ని కుల్చాలని చూస్తున్నారని ఆరోపించారు.