మా ప్రభుత్వం వస్తే మందు బాబులకు వరాలు – చంద్రబాబు నాయిడు

website 6tvnews template 2024 03 27T111743.693 మా ప్రభుత్వం వస్తే మందు బాబులకు వరాలు - చంద్రబాబు నాయిడు

నిన్ననంద్యాల జరిగిన ఒక బహిరంగ సభ లో చంద్రబాబు నాయిడు ప్రసంగిస్తూ తమ ప్రభుత్వం వస్తే ఈ సారి మందు బాబులకు పండగే అని చెప్తూ కొన్ని వరాలు ప్రకటించారు. ప్రస్తుత YCP జగన్ ప్రభుత్వం మద్యం ను చాల ఎక్కువ ధరకు అమ్ము తున్నారని అవి కూడా నాణ్యత లేని మందు ని అంట గడుతున్నారని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వం వస్తే మద్యం ధరలను తగ్గించేదుకు కృషి చేస్తాంనని ఆయన హామీ ఇచ్చారు. ఏవేవో పేర్లు పెడుతూ పేద వారి ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారని ఆయన విమర్శించారు. బూమ్ బూమ్ అని, స్పెషల్ స్టేటస్ అని, బ్రిటీష్ ఎంపైర్ అని , బ్లాక్ బస్టర్ అని చాలా చిత్ర విచిత్ర పేర్లు పెట్టారని అవి పేదవారు తాగి పిచ్చి పిచ్చి గా ప్రవర్తిస్తున్నారని , వల్ల ఆరోగ్యాలు కూడా పాడై పోయి చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ఆరోపించారు.

ఈ సారి తాము అధికారం లోకి రాగానే విద్యుత్ చార్జీలను ఒక పద్ధతి ప్రకారం తగ్గిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మహిళల కోసం RTC లో ఉచితం గా ప్రయాణించే అవకాశం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు సరిగ్గలేని రోడ్లను మంచిగా చెయ్యలేదు కాని 3 రాజధానులు కడతారుట అంటూ ఎద్దేవా చేసారు. అలాగే విశాఖ రాజధాని అన్నారు అది కుడా నాశనం చేసేసారూ అంటూ విమర్శించారు. ప్రకృతి పరంగా ఉన్న వాటిని కుడా నాశనం చేసారని అందుకు ఉదాహరణ గా విశాఖ రుషికొండ గురించి చెప్పారు. ఒకవేళ 2019 లో జగన్ రాకపోయి ఉంటె తెలంగాణా తో సమానం గా అభివృద్ధి చెందేది అని ఆయన అన్నారు. తాను రోజుకు 18 గంటలు కష్ట పడి పని చేస్తానని నాలాగ పని చెయ్యగలడా అని ప్రశ్నించారు.

Leave a Comment