గెలిచిన అబ్యర్ది పార్టీ మారితే అతని సభ్యత్వం రద్దు చెయ్యాలి – రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు !

website 6tvnews template 2024 04 05T154822.035 గెలిచిన అబ్యర్ది పార్టీ మారితే అతని సభ్యత్వం రద్దు చెయ్యాలి - రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు !

ఎన్నికలలో గెలిచిన అభ్యర్ధి వేరొక పార్టీ లోకి వెళ్ళడం అనేది అనాదిగా వస్తున్న ఆచారంలా తయారయ్యింది. ఎవరు ఎప్పుడు ఏ పార్టీ లో ఉంటారో చెప్పలేము. అయితీ దీనికి రాజ్యాంగం లో ఎటువంటి సవరణలు లేక పోవడం వల్ల అభ్యర్ధులు తరచూ పార్టీ లు మారుతూ ఉంటారు. దీని ఆపాలంటే రాజ్యాంగం లో చట్ట సవరణ చెయ్యాలి.

అభ్యర్ధి పార్టీ మారాలనుకుంటే ప్రస్తుతం ఉన్న పార్టీ కి రాజీనామా చేసి మరల ఎన్నికలలో పోటీ చేసి గెలవాలి అనే రూల్ పెడితే ఆ పార్టీ ఫిరాయింపులు ఆపవచ్చు. అయితే గెలిచిన పార్టీని వదిలి ఇతర పార్టీల్లోకి వెళ్ళే వాళ్ళని రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ లో ఉన్న క్లాజ్ ను సవరించి ఆ తర్వాత అతని సభ్యత్వం వెంటనే రద్దు చేయాలి అంటూ కొత్త రూల్ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ తన మానిఫెస్టోలో పెట్టింది .

కాని దీనికి పూర్తి విరుద్ధంగా ఇతర పార్టీలో గెలిచిన రాజకీయ నాయకులను తన పార్టి లోకి ఆహ్వానిస్తున్నారు రేవంత్ రెడ్డి. దీని ఉదాహరణ గా ఇటీవల BRS పార్టీలో గెలిచిన పలువురు MLA లు దానం నాగేందర్, కడియం శ్రీహరి అలాగే MP లు రంజిత్ రెడ్డి, వెంకటేష్ నేత, పసునూరి దయాకర్ లను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు రేవంత్ రెడ్డి.

Leave a Comment