పెళ్లి కాని ప్రసాదులు ఎవరైనా ఉంటె ఇలా చెయ్యండి ! వెంటనే పెళ్లి ఖాయం !

website 6tvnews template 2024 03 22T151829.315 పెళ్లి కాని ప్రసాదులు ఎవరైనా ఉంటె ఇలా చెయ్యండి ! వెంటనే పెళ్లి ఖాయం !

ఈరోజులలో ఎన్ని అర్హతలు ఉన్న పెళ్లి కాని ఆబ్బాయిలు చాల మంది ఉన్నారు. అది వారి గ్రహ చార గోచార ప్రభావం వల్ల కావచ్చు. ఇప్పుడు మేము చెప్పబోయే కొన్ని పరిహారాలు పాటించినట్లయితే తొందర్లోనే మీ వివాహం నిశ్చయం అవుతుంది. బహుశా మీరు కోరుకున్న అమ్మాయి తోనే జరగవచ్చు. లేదా మీకు ఎలాంటి అమ్మాయి రావాలి అనుకుంటున్నారో అలాంటి అమ్మాయి రావచ్చు.

1.41 రోజులు అంటే మండలం రోజులు అంటారు, ఈ సంఖ్యకి చాల ప్రత్యేకత ఉంది. ఇప్పుడు 41 రోజుల పాటు సుబ్రహమణ్యం స్వామి కి ముడుపు కట్టి దానికి పూజ చేయించి దీక్ష చెయ్యాలి. ఈ 41 రోజులు చాల భక్తి శ్రద్ధలతో సుబ్రహమణ్య స్వామి స్తోత్రాలు చదువుకోవాలి. అలాగే మీకు దగ్గలో ఉన్న సుబ్రహమణ్య స్వామి దేవాలయం కి వెళ్ళి 21 సార్లు ప్రదక్షణలు చెయ్యాలి. మీరు ఆలయం లో మీ గోత్ర నామాల మీద పూజ చేయించు కునేటప్పుడు సంకంల్పం సమయం లో ఇలా చెప్పమని పూజారి ని అడగాలి ” వివాహ దోష పరిహారార్ధం ” ఇలా చెప్పిన తర్వాత పూజ చేయించుకోవాలి.

2.పూజ అనంతరం మీ శక్తీ కొలది ఎం సమర్పించిన పర్వాలేదు, ఇదే చెయ్యాలి అనే నియమం లేదు. ముఖ్యం గా కుమారస్వామికి అరటి పండు ముక్కలు,పెరుగు,పాలు,చెక్కర ,తేనె , నెయ్యి ఇవన్ని కలిపి నివేదన చేస్తే చాల మంచిది అని పండితులు చెప్తున్నారు.

3.మీకు దొరికితే ఈ పుస్తాకాలను చదవండి, అవి శ్రీ వల్లీ కళ్యాణం , శ్రీ దేవసేన కల్యాణం , ఇవి చదివితే చాలమంచిది అని పురాణాలలో కూడా చెప్పడం జరిగింది. అలాగే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం, షోడస నామాలు , ఇంకా అష్టకం , కవచం ఇవన్ని మీకు కుదిరినపుడు చదవండి. మీకు వీలు అయితే మీ చేతులు మీదుగా ఆ సుబ్రహమణ్య స్వామి కి పూజ చేసుకుంటే చాలా మంచిది. కాని కొంత మంది తల్లితండ్రులు వారి కోడుకుల పేరు మీద వీరే పూజాలు చేస్తూ ఉంటారు. దీని వల్ల ఎటువంటి ఫలితం ఉండదు అని పండితులు చెబుతున్నారు.

ఈ విధం గా పరిహారాలు చేసినట్లయితే వారి కోరిక తప్పక నెరవేరి తొందరగా వివాహం అవుతుందని పండితులు చెప్తున్నారు. కాబట్టి అబ్బాయిలు పైన చెప్పినవి అన్ని చెయ్యండి తొందలోనే ఒక ఇంటివాళ్ళు అవ్వండి.

Disclaimer:

ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మీకు అందించడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ 6Tv ఇవ్వడం లేదు. అలాగే ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. మా ఉద్దేశం సమాచారం అందించడం వరకు మాత్రమే. ఏదైనా పాటించే ముందు లేదా సందేహాలు ఉన్న సంబంధిత నిపుణుల సలహా తీసుకోమని మనవి చేస్తున్నాం.

Leave a Comment