బస్సు స్టాండ్ లో, రైల్వే స్టేషన్ లో ఫోన్ చార్జింగ్ పెడితే మీ జేబు గుల్లే

website 6tvnews template 2024 03 05T113408.499 బస్సు స్టాండ్ లో, రైల్వే స్టేషన్ లో ఫోన్ చార్జింగ్ పెడితే మీ జేబు గుల్లే

If you charge your phone at the bus stand or railway station, your account will be empty : మనం నిత్యం ఎదో ఒక పని మీద ప్రయాణాలు చేస్తూ ఉంటాం, దీని కోసం బస్సులనో, రైల్ లోనో ప్రయాణం చేస్తూ ఉంటాం. మనతో లగేజ్ లేకపోయినా ఎప్పుడు మనతో ఉండే మొబైల్ మాత్రం ఖచ్చితం గా మనతో ఉండాల్సిందే, సరే ఇప్పుడు ఇది అంతా ఎందుకు జేబు గుల్ల అవుతుంది అన్నావు గా ఎలా అంటారా.

మీరు మీతో పాటు మొబైల్ ఫోన్ తో పాటు చార్జర్ కుడా తీసుకెల్తారు అవునా! ఇది గో ఇక్కడే మీకు తెలియకుండా జరిగే తంతు, మీరు బస్సు స్టాండ్ లోను, రైల్వే స్టేషన్ లోను ఉపయించే చార్గింగ్ పాయింట్ లను సైబర్ నేరగాళ్ళు తమకు అనుకూలం గా మార్చుకుంటున్నారు.

ఇది ఎలాగా అంటారా మీరు ఎప్పుడైతే ఛార్జింగ్ లో పెట్టారో అక్కడే మీకు తెలియయకుండా చిన్న పరికరాన్ని అమరుస్తారు. దీని ద్వారా మీ ఫోన్ ని హాకింగ్ చేస్తారు. దేనినే హ్యాకింగ్ జ్యూస్ అని అంటారు. ఎప్పుడైతే మీరు చార్గింగ్ పెట్టారో మీ కేబుల్ ద్వారా మీ ఫోన్ లో ఉన్న మొత్తం సమాచారం సైబర్ నేరగాళ్ళ చేతులోకి వెళ్ళిపోతుంది. USB కేబుల్ తో పాటు ఖచ్చితంగా అడాప్టర్ కూడా ఉపయోగించాలి, నేరుగా USB కేబులు ని చార్గింగ్ పాయింట్ లో పెట్టకండి.

ఇటీవల వరుసగా రిజర్వ్ బ్యాంక్ లో ఎక్కువగా మనీ ట్రాన్సాక్షన్ జరుగగా దీని మీద నిఘా పెట్టగా వారికి వచ్చిన సమాచారం మేరకు ఇలా USB కేబుల్ తో చార్గింగ్ పెట్టె దగ్గర నుండి కస్టమర్లు కి తెలియకుండా సైబర్ నేరగాళ్ళు వాళ్ళ బ్యాంకు అకౌంట్ లోంచి డబ్బులు కొట్టేస్తున్నట్లు గుర్తించారు.

అందుకే భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఒక హెచ్చరిక జారి చేస్తూ ఎక్కడ పడితే అక్కడ USB కేబుల్ ద్వార ఫోన్ చార్గింగ్ పెట్టవద్దని, ప్రతి ఒక్కరు బయట ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు మీతో పాటు అడాప్టర్ కూడా ఉంచుకోవాలి అని రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటన విడలచేసింది.

Leave a Comment