స్నానం చేసాక ఈ పనులు చేస్తే దరిద్రం మీ వెంటే – మీ తోనే !

WhatsApp Image 2024 03 16 at 11.41.49 AM స్నానం చేసాక ఈ పనులు చేస్తే దరిద్రం మీ వెంటే - మీ తోనే !

మనం స్నానం చేసిన తర్వాత బకెట్ ఖాళీగా ఉంచకూడదు, వాస్తు రీత్యా బకెట్లో కనీసం సగం నీటితోనే నింపడం మంచిది. ఒకవేళ మీరు నీళ్ళతో నింపకూడదు అనుకుంటే బకెట్ తలకిందులుగా బోర్లించి ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల వాస్తు దోషాలు ఉండవు. చాలామంది స్నానం చేసిన వెంటనే మేకప్ వేసుకుంటారు అలా చేయకూడదు అలా చేసినట్లయితే మనలో ఏర్పడిన పాజిటివ్ ఎనర్జీ అంతా బయటకు పోతుంది.

చాలా మంది తలస్నానం చేసిన తర్వాత తల సరిగ్గా తుడుచుకోకపోవడం వల్ల మనలో నేగిటివ్ ఎనర్జీ మనలో ప్రవేశించి ఆ రోజు అంతా మనసు లో అనేక రకాల ఆందోళనలు కలుగుతాయి. పెళ్లయిన స్త్రీలు స్థానం చేసిన వెంటనే జుట్టు తడిగానే ఉంచుకొని కుంకుమ బొట్టు పెట్టుకుంటారు అలా పెట్టుకోవడం వల్ల వాళ్ల మీద ప్రతికూల ప్రభావం పడి మనసులో నెగిటివ్ ఆలోచనలు వస్తాయి ఇది ఎప్పటికీ మంచిది కాదు. చాలామంది స్నానం చేసిన తర్వాత తడి బట్టలు వదిలేస్తారు బాత్ రూమ్ లో. బాత్రూంలో తడి బట్టలు ఉండడం వల్ల వాస్తు ప్రకారం మన గృహం లో ఉన్న సూర్యుని స్థానం బలహీనపడుతుంది.

కాబట్టి స్నానం చేసే ముందే బట్టలు ఉతుక్కోవాలి. కొంతమంది స్నానం చేసిన వెంటనే గోళ్ళు కత్తిరించడం చేస్తుంటారు అది పరమ దరిద్రం అనే చెప్పాలి. చాలామంది స్త్రీలు స్నానం చేసాక తడి తలతోనే కూరగాయలు కోయడం, గోళ్ళు కత్తిరించడం వంటివి చేస్తు ఉంటారు, దానివల్ల చాలా ప్రతికూల ప్రభావం లేదా నెగిటివ్ ఎనర్జీ ఏర్పడి మనసుకి శాంతి లేకుండా పోతుంది. అంతే కాదు స్నానం చేసిన తర్వాత గోళ్లను కత్తిరించుకోవడం వల్ల ఆ వ్యక్తి కి ఉన్న గౌరవం, ప్రతిష్టలు తగ్గిపోతాయి. దానివల్ల మీరు ఊహించలేని విధంగా డబ్బు నష్టాన్ని ఎదుర్కొని అనేక ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు.

స్నానం చేసిన వెంటనే బాత్ రూమ్ క్లీన్ చేయడం మంచిది లేకపోతే రాహువు, కేతువు ,శని గ్రహాలు వల్ల మన ఇంటిలో మనశ్శాంతి కరువుతుంది , చికాకులు ఏర్పడతాయి. బాత్రూం శుభ్రం చేసుకోకపోవడం వల్ల ఈ మూడు గ్రహాలు అంటే రాహువు, కేతువు శని గ్రహాలు మనకు వ్యతిరేక దిశలో పనిచేసి మనకి మన కుటుంబ సబ్యులకు తీవ్ర నష్టాలు, మానసిక సమస్యలు ఏర్పడి ఉన్నత స్ధానం కు చేరుకోలేము. ఈ నియమాలు పాటించండి మీ గృహం లో ఆనంద, సంతోష వాతావరణం కలుగచేసుకోండి.

Leave a Comment