పెద్ద చదువుల కోసం వెళ్తే పస్తులు ఉండాల్సి వస్తోంది – తెలుగు రాష్ట్రం లోనే

WhatsApp Image 2024 03 12 at 11.57.40 AM పెద్ద చదువుల కోసం వెళ్తే పస్తులు ఉండాల్సి వస్తోంది - తెలుగు రాష్ట్రం లోనే

అది ఒక ప్రఖ్యాత విద్యా సంస్ద అక్కడ చదివిన వారు పెద్ద పెద్ద హోదా లలో ఉన్నారు ఈరోజు. ఎంతో పేరు గాంచిన అంతటి విద్యా సంస్ద ఈరోజు అపఖ్యాతి మూటకట్టుకుంది. అదే నూజివీడు ట్రిపుల్ ఐటి. ఈ పేరు ఆంధ్ర ప్రదేశ్ లో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న విద్యా సంస్ద. ఆ ఇన్స్టిట్యూట్ లో జేరడం కోసం చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి చదివి IIIT లో సీటు సాధించి అక్కడ కోర్సులు పూర్తి చేసి తమ లక్ష్యాలు చేరుకోవడం అనేది విద్యార్ధులు అలాగే వారి తల్లి తండ్రులు ఆశ పడుతుంటారు.

అయితే ఎంతో కష్ట పడి మంచి మార్కులతో ట్రిపుల్ ఐటీలో సీటు సంపాదిస్తారు ఇంతవరకు బాగానే ఉన్న ఆ తర్వాత మొదలు అవుతాయి వారి కష్టాలు. చదువులు చెప్పే గురువులు ఉంటారు. చదువులు బాగానే ఉంటాయి. సమస్య ఎక్కడ అంటే వారు పెట్టె భోజనం. ఇప్పుడు అక్కడ పెడుతున్న భోజనం ఎం బాగుండడం లేదని అసలు రుచి సంగతి ఎలా ఉన్న పదార్ధాలలో బొద్దింకలు రక రకాల పురుగులు వస్తున్నాయని విద్యార్దులు నిరసనలు తెలుపుతున్నారు.

WhatsApp Image 2024 03 12 at 11.57.41 AM పెద్ద చదువుల కోసం వెళ్తే పస్తులు ఉండాల్సి వస్తోంది - తెలుగు రాష్ట్రం లోనే

గత కొంత కాలం గా భోజనం ఇలాగే ఉంటోందని ఎన్ని సార్లు ఆందోళనలు చేసిన ఇన్స్టిట్యూట్ అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్ధులు చెప్తున్నారు. గతంలో అనేక సార్లు సంబంధిత కాంట్రాక్టర్‎కు నోటీసులు ఇచ్చిన అవి కాగితాలకే పరిమితం అవుతున్నాయి కాని విద్యార్థుల సమస్యలు, బాధ ఏమాత్రం తీరడం లేదు. నాణ్యమైన ఆహారం దొరకక అందరం ఆకలితో విద్యార్థులు అందరం పస్తులుండాల్సిన పరిస్థితి వస్తోందని చెప్తున్నారు.

ఈ విషయం లో అధికారులు కాని , అధ్యాపకులు కాని శాశ్వత పరిష్కారం కోసం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విద్యార్ధులు అలాగే వారి తల్లి తండ్రులు తీవ్ర స్దాయిలో ఆందోళనలు చేస్తునారు. ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న ఇలాంటి విద్యా సంస్ద కా ఈ పరిస్థితి అని అందరు అనుకుంటున్నారు. మెస్ కి సరుకులు కాంట్రాక్టర్ ఏ మాత్రం నాణ్యత లేని రైస్, కూరలు సప్లయ్ చేస్తున్నారఅని అలాగే నాసిరకం సరుకులతో ఆహార పదార్ధాలు తయారు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

WhatsApp Image 2024 03 12 at 11.57.41 AM 1 పెద్ద చదువుల కోసం వెళ్తే పస్తులు ఉండాల్సి వస్తోంది - తెలుగు రాష్ట్రం లోనే

అంతేకాక అక్కడ ఉన్న విద్యార్థులతో ఆహార నాణ్యతపై ఒక కమిటీ వేసి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని ఒక తీర్మానం కుడా చేశారు. కాని శ్రమ పడినది అంతా కాగితాలకే పరిమితమైందని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ట్రిపుల్ ఐటీ క్యాంపస్ మెస్‎లో ఒక విద్యార్ధి కి కోడి కూరలో బొద్దింక వచ్చింది. IIIT లో ఆదివారం నాడు మెస్‎లో చికెన్ స్పెషల్‎గా వడ్డిస్తారు.

అలా స్పెషల్‎గా వండిన చికెన్ కర్రి లో చనిపోయిన బొద్దింక విద్యార్థుల కంట్లోపడింది. దాంతో విద్యార్థులు అందరు ఆ ఆహారాన్ని తినకుండానే వదిలేశారు. ఆ తర్వాత రోజు అయితే విద్యార్థులు తినే అన్నంలో చిన్నచిన్న పురుగులు అందరి ప్లేట్ లలో కనిపించాయి, నాణ్యత లేకుండా పురుగులు ఉన్న ఆహారాన్ని ఎలా తినాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎన్నిసార్లు ఉపాధ్యాయులకు, అధికారులకు మొర పెట్టుకున్న కాంట్రాక్టర్ తీరు మారడం లేదని విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Comment