ఈ లాకెట్ మీ దగ్గర ఉంటె అందరు మీ వెంట ఉన్నట్లే

a36031d7 d482 4023 8f77 7a47747a0d0d ఈ లాకెట్ మీ దగ్గర ఉంటె అందరు మీ వెంట ఉన్నట్లే

ఈరోజుల్లో చిన్న పిల్లల దగ్గర నుండి వయస్సులో ఉన్న స్త్రీలకు బయటకి వెళ్తే ఎన్నో రకాల సమస్యలు ఎదురుఅవుతాయి. ముఖ్యం గా ఎక్కడ పడితే అక్కడ ఆకతాయిలు తో నిత్యం అనేక సమస్యలు వస్తూనే ఉంటాయి. వేదింపులు నుండి మహిళలకు ఎన్ని రక్షణ జాగ్రత్తలు తీసుకున్న ఆకతాయిల ఆగడాలు ఆపలేక పోతున్నారు.

పెరుగుతున్న ఆగడాలు నేపద్యంలో మహిళల కోసం ఎన్నో మొబైల్ యాప్ లు వచ్చాయి. అయితేట్ ఇప్పుడు ఒక రకమైన లాకెట్ వచ్చింది. దీనినే “సేఫర్ స్మార్ట్ జ్యువెలరి ” అని అంటారు. దీనిలో ఒక చైన్ ఉండి దానికి ఒక లాకెట్ ఉంటుంది. దీనిని ఒక మొబైల్ యాప్ తో కనెక్ట్ చేసుకోవాలి. అలాగే మనకి కావలసిన వాళ్ళ నెంబర్ లు అన్ని అందులో ఎక్కించుకోవాలి.

దీని వల్ల లాభం ఏంటంటే ఎవరైనా ఆకతాయిలు లేదా అపరిచితులు మిమ్మల్ని వెంబడిస్తే ఆ విషయాన్ని ఈ లకేట్ పసిగట్టి మీ కుటుంబ సబ్యులకు, స్నేహితులకు ఒక మెస్సేజ్ రూపం లో వారికి చేరిపోతుంది. ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది అంటే మీ వేసుకున్న లాకెట్ లో వెనుక ఒక బటన్ ఉంటుంది. దానిని రెండు సార్లు ప్రెస్ చేస్తే మనకి కావలసిన వాళ్లకు మనం ప్రమాదం లో ఉన్నాం అని ఒక మెస్సేజ్ వెళ్ళిపోతుంది.

Leave a Comment