If you know how many benefits women wear belts? : ఈ ప్రపంచలో నున్న స్త్రీలకూ వెండి అన్నా, బంగారమన్నా ఎంత ఇష్టమో ప్రత్యకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి వేడుకలు వచ్చిన అన్ని రకాల ఆభరణాలు దరించి ప్రత్యేకం కనిపించేలా తయారవడం వీరి ప్రత్యకత. అంతే కాదు వీరు ధరించే ఆభరణాలలో ఒక్కక్క దానికి ఒక్కక్క ప్రత్యకత ఉంటుంది.
అంతే కాదు వీరు ఇంటిలో ఉన్నప్పుడు మామూలు నగలతో ఉంటారు. అందులో చెప్పుకో దగ్గవి మంగళ సూత్రం కాళ్ళకు మట్టెలు అలాగే పట్టీలు. కాని ఈ ఆధునిక ప్రపంచం లో అడుగుపెడుతున్న స్త్రీలు ఫాషన్ పేరు చెప్పి లేదా వేరే ఇతర కారణాల తాము వేసుకున్న నగలను తీసేస్తున్నారు, దీనివల్ల ఎన్ని అనర్ధాలు ఉంటాయో ఈ కాలపు స్త్రీలకూ తెలియడం లేదు. అయితే ఇది వారి వారి ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది.
కాని హిందూ మతం లో ఉన్న ప్రతీ స్త్రీ అన్ని నగలు వేసుకోక పోయన కొన్ని సాంప్రదాయాలు పాటించాలని చెప్తున్నారు పండితులు. ముఖ్యం గా మంగళ సూత్రం కాలికి మేట్టలు, అలాగే పట్టీలు. ఇపుడు స్త్రీలు పెట్టుకునే ఈ వెండి పట్టీలు పెట్టుకోక పోతే ఏం అవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? స్త్రీలు కాళ్లకు పట్టీలు పెట్టుకోవడం వల్ల వారికి అందం మరింత పెరుగుతుంది. అందువల్లనే చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ పట్టీలను పెట్టుకోవడం మనం చూస్తూ ఉంటాం.
అయితే వెండి పట్టీలను పెట్టుకునేది అనాదిగా వస్తున్న ఆచారం,ఇది ఎప్పటి నుంచో వస్తోంది. అంతే కాదు హిందూ మతం లో ఉన్న స్త్రీలు దీన్ని ఒక సంప్రదాయంగా కూడా పాటిస్తారు. అయితే మన పూర్వీకులు ఆభరణాలు గురుంచి చెప్పే ప్రతిదానికి ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది. ఇది సాంప్రదాయకంగా స్త్రీలు అనుసరిస్తున్నప్పటికీ ఈరోజు వీటిని ఎన్నో రకాల డిజైన్లలో వీటిని పెట్టుకుంటున్నారు. అసలు వెండి పట్టీలను పెట్టుకుంటే ఆడవారికి ఏం జరుగుతుంది? ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మీకు తెలుసా !
వెండి పట్టీలను వల్ల కలిగే ప్రయోజనాలు
1.సాధారణంగా మగవారిలో కంటే స్త్రీలలో శరీరంలోనే వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ వేడి తగ్గేందుకు వెండి పట్టీలను పెట్టుకోవడం చాలా మంచిది అని చెప్తారు పెద్దలు, ఈ వెండి పట్టీలకు వేడి ను గ్రహించే స్వభావం ఉంటుందని అది కుడా కాళ్ళ వద్ద ఉండే సున్నితపు నరాలు ద్వారా ఈ వెండి పట్టీలు వేడిని గ్రహిస్తాయని అందుకే స్త్రీలు పట్టీలు పెట్టుకోవడం చాల ముఖ్యమని చెప్తున్నారు పెద్దలు అలాగే శాస్త్ర పండితులు.
2.స్త్రీలు కాళ్లకు వెండి పట్టీలను పెట్టుకోవడం వల్ల శరీరం లో ఉండే ఎముకలు చాలా బలంగా మారతాయి అని ఆయుర్వేద నిపుణులు. అంతే కాదు సిల్వర్ మెటల్ చీలమండలను తాకి ఎముకలను బలోపేతం చేస్తుందని దీనివల్ల భవిష్యత్ లో మోకాళ్ళ నెప్పులు పాదాల సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు.
3.ముఖ్యం గా స్త్రీలు ఈ వెండి పట్టీలను పెట్టుకునే మహిళలకు ప్రతీ నెల భాధ పెట్టె రుతుక్రమ సమస్యలు అనేవి వీరికి రావు. అలాగే వీరి గర్భాశయం కూడా ఎటువంటి సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. అలాగే వెండి పట్టీలను పెట్టుకోవడం వల్ల మహిళల్లో హార్మోన్ల సమస్యలు తలెత్తకుండా ఎప్పుడు హార్మోన్ల స్థాయిలను సమతుల్యంగా ఉంచుతుందని ఎన్నో అధ్యయనాలు ద్వరా పిరూపించబడింది. వెండి పట్టీలు పెట్టుకోవడం వలన వల్ల కాళ్ల నొప్పులు రాకుండా చూసుకోవచ్చని, ఒకవేళ కాళ్ళ నెప్పులు ఉంటె వాటిని అదుపులో ఉంచవచ్చని పెద్దలు చెప్తున్నారు.
4.స్త్రీలు పెట్టుకునే ఈ వెండి పట్టీలు మడమ నాడిని ఎప్పుడూ తాకుతూ ఉంటాయి. ఇక్కడ అనేక నాడులు ఉంటాయి. ఈ నాడుల ద్వారా మెదడుకు వెళ్లే అనుభూతులను అలాగే ఆందోళనలు కంట్రోల్ చెయ్యడం జరుగుతుంది. అంతే కాదు స్త్రీల నడుము భాగాన్ని బలోపేతం చేయడానికి కూడా వెండి పట్టీలు చాల సహాయపడతాయని ఆయుర్వేద శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అందుకే మన పూర్వీకులు కాలానికి అనుగుణంగా వెండిని కాళ్లకు కడియాలు గాను పట్టీల గాను ఎన్నో రూపాల్లో ఉపయోగిస్తూ వస్తున్నారు.