Prakash Raj’s tweet KCR: గెలిస్తే పొంగేది లేదు.. ఓడితే కుంగేది లేదు..కేసీఆర్‎పై ప్రకాష్ రాజ్ ట్వీట్.

If you win, you will not be proud.. If you lose, you will not be depressed.. Prakash Raj's tweet on KCR.

Prakash Raj’s tweet KCR: గెలిస్తే పొంగేది లేదు.. ఓడితే కుంగేది లేదు..కేసీఆర్‎పై ప్రకాష్ రాజ్ ట్వీట్..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్‎పై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఓ పక్క ఎన్నికల్లో గెలుపు సాధించిన తెలంగాణ కాంగ్రెస్‌కు అభినందనలు తెలుపుతూనే మరోవైపు కేసీఆర్‎పై ఎమోషనల్ ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్.

మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అంతే కాదు ఎప్పటిలాగే ప్రకాష్ రాజ్ తన ట్వీట్‎లో ట్రోలర్స్‎కు స్వాగతం అంటూ తనదైన స్టైల్‎లో ముగింపు ఇచ్చారు.

ఈసారి తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ మీరా మేమా అన్నట్లుగా ఎన్నికల ఫలితాల వేళ టగ్ ఆఫ్ వార్ జరిగింది. ఎట్టకేలకు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టింది. ఈ క్రమంలో తెలంగాణకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఎన్నుకుంది.

రేపు మధ్యాహ్నం రేవంత్ రెడ్డి 1.04 నిమిషాలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఇప్పటికే పలువురు ప్రముఖులు స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.

ఇదే క్రమంలో పదేళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మద్దతుగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇటీవలె దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, సినీ స్టార్స్ సందీప్‌ కిషన్‌, నిఖిల్, యాంకర్ అనసూయలు తెలంగాణ మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు మద్దతుగా సోషల్‌ మీడియాలో ఎమోషనల్ పోస్టులు షేర్ చేశారు.

ఇదే క్రమంలో తాజాగా విలక్షణ నటుడు ప్రకాష్‌ రాజ్‌ కూడా ఎన్నికల రిజల్ట్స్‎పై రియాక్ట్ అయ్యారు. బీఆర్‌ఎస్‌ ఓటమిపై ఆవేదన వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

” ఇది చాలా బాధించే విషయం. అయినా ప్రజా తీర్పును అందరూ తప్పక గౌరవించాల్సిందే. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌కు శుభాకాంక్షలు. కేసీఆర్‌, కేటీఆర్‌లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. కేసీఆర్ గారు, కేటీఆర్ మీ గుండె ఎప్పుడు తెలంగాణ కోసమే కొట్టుకుంటుందని మాకు తెలుసు.

మేమంతా మీ వెంటే ఉంటాము”అంటూ ప్రకాష్ రాజ్ ఎమోషనల్ అయ్యారు. చివరగా ట్రోలర్స్‎కు వెల్కమ్ అంటూ పంచ్ ఇవ్వడంతో ఈ ట్వీట్ ఆసక్తికరంగా మారింది.

‘గెలిస్తే పొంగేది లేదు.. ఓడితే కుంగేది లేదు’ అనే క్యాప్షన్ ఉన్న కేసీఆర్ పిక్ షేర్ చేస్తూ ఈ ఎమోషనల్ నోట్ యాడ్ చేశారు ప్రకాష్ రాజ్. దీనిపై ఇప్పుడు నెట్టింట్లో పెద్ద చర్చ మొదలైంది. బీఆర్‌ఎస్ పార్టీకి ప్రకాష్ రాజ్ ఎప్పుడూ సపోర్ట్ గానే ఉన్నారు.

అప్పట్లో కేసీఆర్ కర్ణాటక పర్యటనకు వెళ్లినప్పుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించారు. నేషనల్ పాలిటిక్స్‎లోకి కేసీఆర్ రావడాన్ని ఆయన ఆహ్వానించారు. దేశవ్యాప్తంగా బీఆర్‌ఎస్ విస్తరణకు తనవంతు సపోర్ట్ కూడా అందించారు.

Leave a Comment