Vaastu Houses: మీ ఇల్లు ఇలా కట్టుకుంటే..మీ దశ తిరిగిపోతుంది.

If your house is built like this..your step will be reversed.

Built like this: మీ ఇల్లు ఇలా కట్టుకుంటే..మీ దశ తిరిగిపోతుంది.

మన భారతీయులకు సంబంధించిన అతి ప్రాచీనమైన విద్యలలో జ్యోతిష్యశాస్త్రంతో పాటు వాస్తు శాస్త్రం కూడా ఒకటి. వసతి ఇతి వాస్తు: అంటారు. 

అంటే మనం నివసించే చోటకానీ, కార్యాలయాలు కానీ ఏదైనా సరే నివాసాల నిర్మాణాలలో ఏది ఎక్కడ ఉండాలి, ఏ దిశలో ఉండాలి ఎలా ఉండాలి లాంటి విధి విధానాలను శాసించే శాస్త్రమే వాస్తు శాస్త్రం. దీని ప్రకారం ఎనిమిది దిక్కులను ప్రధానంగా తీసుకుంటారు. వాటి ఆధారంగానే వాస్తుశాస్త్ర నిర్మాణాలు ఆధారపడి ఉంటాయి.

అయితే ఈ దిశలలో కొన్ని రకాల దిశలు కొన్ని పనులకు అనుకూలంగా ఉంటే, మరికొన్ని ప్రతికూలంగా ఉంటాయి. ఒకవేళ వీటికి అనుకూలంగా వాటి నిర్మాణాలు ఉండకపోతే వాటి ప్రతికూల ప్రభావాలు మన నిత్యజీవితంపై పడతాయి.

అందుకని వాస్తుకు అనుగుణంగా నిర్మాణాలను చేపట్టాలి. ఏ దిశలలో ఏ నిర్మాణాలు చేపడితే ప్రతికూల ప్రభావాలను తొలగించుకోవచ్చో తెలుసుకోండి.

Add a heading 2023 12 04T143100.020 Vaastu Houses: మీ ఇల్లు ఇలా కట్టుకుంటే..మీ దశ తిరిగిపోతుంది.

ఉత్తర దిక్కు :

ఉత్తర దిశ సంపదను సూచిస్తుంది. అలాగే ఆఫీసు కార్యకలాపాలకు కూడా ఈ దిశ అనుకూలంగా ఉంటుంది. అందుకని ఈదిశలో ఆఫీసు నిర్మాణాలు ఉంటే బాగుంటుంది. ఇక ఇంట్లో అయితే ప్రవేశ ద్వారం, పడక గది, తోట, వాకిలి, బాల్కనీలు, స్విమ్మింగ్ పూల్ లాంటి నిర్మాణాలను ఈ దిశలో నిర్మించికోవచ్చు.

దక్షిణ దిక్కు :

దక్షిణ దిశ అనేది కీర్తి ప్రతిష్టతలను పెంచుతుంది. ఇంట్లో దక్షిణ దిశ వైపు మాస్టర్ బెడ్ రూం ఉండేలా ఏర్పాటు చేసుకోవచ్చు. కార్యాలయంలో అయితే సీఈఓ ఛాంబర్ ను ఈ దిశలో పెడితే పేరు ప్రతిష్టతలు పెరుగుతాయి.

పశ్చిమ దిశ :

పశ్చిమ దిశ అనేది పనులను చేసుకునేందుకు వీలుగా ఉంచుకోవచ్చు. అంటే ఇంట్లో అయితే ఈ దిశలో స్పోర్ట్స్ రూం, లేదా చిల్ట్రన్స్ బెడ్ రూం, డైనింగ్ హాల్ లాంటి నిర్మాణాలు చేపట్టవచ్చు.

ఇక కార్యాలయాల్లో అయితే పనిచేసే ఉద్యోగస్తులకు వారి వారి సీట్లకు, క్యాబిన్లకు ఈ దిశను కేటాయించవచ్చు. దీనివల్ల పని సక్రమంగా జరిగే అవకాశాలున్నాయి.

తూర్పు దిశ :

Add a heading 2023 12 04T143729.424 Vaastu Houses: మీ ఇల్లు ఇలా కట్టుకుంటే..మీ దశ తిరిగిపోతుంది.

సూర్యుడు ఉదయించే దిశ తూర్పు. అంటే ఈ దిశలో వెలుతురు బాగా వస్తుంది. అందుకని ఈ దిశలో కిటికీలు, పెద్ద పెద్ద తలుపులు, బాల్కనీలు, తోటలు ఉంటే బాగుంటుంది.

అలాగే లాంజ్ ఏర్పాటు చేసుకోవాలన్నా, డ్రాయింగ్ రూం లాంటివి ఏర్పాటు చేసుకోవాలన్నా ఈ దిశలో కట్టుకుంటే బాగుంటుంది. ఆఫీసులో అయితే ఈ దిక్కు వైపు మీటింగ్ రూం లాంటివి ఏర్పాటు చేసుకోవచ్చు.

ఈశాన్యం దిశ :

నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం ఉన్న ప్రాంతం ముఖ్యంగా దైవానికి సంబంధించిన కార్యక్రమాలు చేయడానికి అనుకూలమైనది. అందువల్ల ఈ దిక్కున పూజమందిరం కానీ, లేదా ధ్యాన మందిరం కానీ, యోగా రూం లాంటివి ఏర్పాటు చేసుకోవాలి.

తద్వార తొందరగా దైవ అనుగ్రహాన్ని పొందగలుగుతాం. ఆఫీసలులో కూడా ఈవైపున దైవ సంబంధించిన అంశాలను పెట్టుకుంటే మంచిది. అయితే ఈశాన్య దిక్కులో బరువులు అస్సలు ఉంచరాదు. దానివల్ల ఇంట్లో, లేదా ఆఫీసులో సమస్యలు ఏర్పడుతాయి.

వాయువ్య దిశ :

వాయువ్యం అంటే నార్త్ వెస్ట్ ప్రాంతం ప్రధానంగా గాలిని సూచిస్తుంది. అందుకని ఈ దిశవైపు ఆఫీసులో అయినా సరే, ఇంట్లో అయినా సరే టాయిలెట్స్, గెస్ట్ రూం, ఎలివేటర్లు, ఏసీలు లాంటివి అన్నీ ఏర్పాటు చేసుకోవచ్చు.

నైరుతి దిశ :

సౌత్ ఈస్ట్ అంటే నైరుతి ప్రాంతం వాస్తుపరంగా బలమైన ప్రాంతంగా చెప్పబడుతుంది. బరువుగా ఉన్న వస్తువులను ఈ ప్రాంతంలో పెట్టుకోవచ్చు.

ఇంట్లో అయితే వార్డ్ రోబ్ లను ఉంచుకోవచ్చు. ఇక కార్యాలయం విషయానికి వస్తే ఈ ప్రాంతంలో డిస్కషన్ రూంలు, లేదా సీనియర్ అధికారులకు బెడ్ రూంలు ఏర్పాటు చేయవచ్చు.

Add a heading 2023 12 04T143236.386 Vaastu Houses: మీ ఇల్లు ఇలా కట్టుకుంటే..మీ దశ తిరిగిపోతుంది.

ఆగ్నేయం దిశ :

సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం ప్రాంతానికి అగ్నిదేవుడు అధిపతిగా ఉంటాడు. ఈ దిశ ఎక్కువగా ఇంటి యజమానుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా వంటగది ఉండడం శ్రేయస్కరం. ఇంట్లో మరెక్కడా కూడా వంటగదిని ఏర్పాటు చేసుకోవడానికి వీల్లేదు.

ఈ దిశలోనే తప్పనిసరిగా ఉండాలి. ఇక కార్యాలయాల విషయానికి వస్తే ఆఫీసు క్యాంటీన్ కానీ, ఇన్వర్టర్ లాంటి విద్యుత్ పరికరాలను ఇక్కడ ఉంచవచ్చు. అంతేకాదు సృజనాత్మక కార్యకలాపాలకు కూడా ఈ దిశను ఉపయోగించవచ్చు.

ఇలా ఎనిమిది రకాల దిశలలో మనం కనుక వాస్తు ప్రకారం కట్టుకోగలిగితే దానికి సంబంధించిన అనుకూల ప్రభావాలని పొందగలుగుతాము.

Leave a Comment