Ileana D’Cruz: అతడిని ఏమైనా అంటే తట్టుకోలేను

website 6tvnews template 2024 03 18T175346.897 3 Ileana D'Cruz: అతడిని ఏమైనా అంటే తట్టుకోలేను

ఇలియానా(Ileana D’Cruz) గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. రామ్ (Ram)హీరోగా వచ్చిన ‘దేవదాసు’ (Devadasu)సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ గోవా బ్యూటీ మొదటి సినిమాతోనే అందరి మైండ్ బ్లాక్ చేసింంది. ఫస్ట్ మూవీ సూపర్ హిట్ కావడంతో ఇల్లి బేబీకి ఆఫర్స్ వెల్లువలా వచ్చాయి. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannath) డైరెక్షన్ లో మహేష్‌ బాబు (Mahesh Babu) హీరోగా వచ్చిన ‘పోకిరి’ (Pokiri) తో స్టార్ హీరోయిన్ రేంజ్ ను సంపాదించుకుంది.

WhatsApp Image 2024 03 19 at 10.25.01 AM Ileana D'Cruz: అతడిని ఏమైనా అంటే తట్టుకోలేను

ఆ తర్వాత టాలీవుడ్ లో టాప్ హీరోలందరి సరసన నటించి తన అందంతో నటనతో అందరిని అలరించింది. అంతేకాదు తెలుగు సినిమాలోలో కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న మొదటి హీరోయిన్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది ఇలియానా.
ఇదిలా ఉంటే గత కొంతకాలంగా ఇలియానా బాయ్ ఫ్రెండ్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. దీనిపై మొదటిసారి ఇలియానా స్పందించింది . ఆ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

నా జీవితం పూర్తిగా మారిపోయింది :

ఓవైపు తెలుగులో టాప్ హీరోయిన్‌గా రాణించే సమయంలోనే బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ పలు హిట్ సినిమాల్లో నటించి బీటౌన్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే గత కొంత కాలంగా ఇలియానా(Ileana D’Cruz )సినిమాలకు దూరంగా ఉంటూ పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. గత కొన్నేళ్లుగా మైఖేల్ (Michael) తో రిలేషన్‌లో ఉంది ఇలియానా.

WhatsApp Image 2024 03 19 at 10.25.12 AM Ileana D'Cruz: అతడిని ఏమైనా అంటే తట్టుకోలేను

ఈ మధ్యనే పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఆ బాబుకు కోవా ఫినిక్స్ డోలన్ (Koa Phoenix Dolan) అని పేరు కూడా పెట్టింది. బాబు రాకతో నా జీవితం పూర్తిగా మారిపోయిందని సోషల్ మీడియాలోనూ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చింది ఈ బ్యూటీ. అయితే పెళ్లి కాకుండానే తల్లి కావడం ఇక్కడ అసలైన ట్విస్ట్.

అతడే నా ప్రపంచం :

ప్రియుడితో పెళ్లి జరగకముందే పిల్లాడిని కనడంపై సోషల్ మీడియాలో కొంతకాలంగా ఇలియానా (Ileana)ను నెటిజన్స్ ట్రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఇలియానా ప్రియుడు మైఖేల్‌ (Michael)ను విమర్శిస్తున్నారు. దీంతో ఇలియానా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించింది… ” ఓ నటిగా నేను పబ్లిక్‌ డొమైన్‌లో ఉన్నాను. నన్ను ఏమన్నా పెద్దగా బాధపడను.

చాలా లైట్ గా తీసుకుంటాను. కానీ బిడ్డకు తండ్రైన మైఖేల్‌ను ఏమైనా అంటే నేను తట్టుకోలేను. నా ప్రెగ్నెన్సీ సమయంలో మైఖేల్ నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నాడు. అతనితో పాటు మా అమ్మ కూడా నన్ను కంటికి రెప్పలా కాపాడింది. నేను మనో ధైర్యం కోల్పోయినపుడు తానే ధైర్యం నూరిపోశాడు. మైఖెల్, నా కొడుకే నాకు ప్రపంచం. నా బాయ్ ఫ్రెండ్ మంచి మనసున్న మనిషి. నేను యాక్ట్ చేసిన మూవీస్ లోని పటలను తాను పాడుతుంటాడు. ఇంతకంటే మంచితనానికి నిదర్శనం ఏముంటుంది”.అని అంటోంది గోవా సుందరి.

Leave a Comment