‘Dhootha’ Pan World Series: 30 భాషల్లో, 240 దేశాల్లో పాన్ వరల్డ్ సిరీస్ గా దూసుకెళ్తున్న దూత!
అక్కినేని అభిమానులకు ఇన్నిరోజులకు పండగ.ప్రభాస్ తో మొదలైన పాన్ ఇండియా టాగ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ కొనసాగించడం.
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ గుర్తింపు తెచ్చుకోవడం ఇలా ఒక్కసారి పాన్ ఇండియా గేట్లు తెరిచాక తెలుగు చిత్ర పరిశ్రమ దాని వెనకాలే వెళ్లడం పరిపాటిగా సాగుతోంది.
అయితే తెలుగు ఇండస్ట్రీలో స్టార్ ఢమ్ ఉన్న హీరోల కరీర్ బాగానే సాగుతోంది. వరుస సినిమాలతో హిట్టు జాబితాలతో వారి సినీప్రయాణం సాగుతోంది. అయితే అక్కినేని కుటుంబంలో నుంచి సినిమాలు అంతగా రావడం లేదు, నాగచైతన్య మౌనంగా మారాడు అన్న విమర్శ బాధాకరంగా ఉంది.
ఇలాంటి సమయంలో OTTలో నాగచైతన్య చేసిన ఒక్క సిరీస్ అది కూడా నాగచైతన్య డెబ్యూ సిరీస్ పాన్ వరల్డ్ రెస్పొన్సెస్ తీసుకొస్తున్నాయి. ఆ సిరీస్ మరేదో కాదు ” దూత “.
ఈ దూత సిరీస్ కి కే విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. శరత్ మరార్ ప్రొడ్యూస్ చేసిన దూత నార్త్ ఎంటర్టైన్మెంట్స్ లో నిర్మాణం జరిగింది.
ఈ సిరీస్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది, ఈ దూత OTT ప్లాట్ ఫారంలో నెంబర్ 1గా నిలిచింది.యువ సామ్రాట్ నాగచైతన్య నటించిన దూత 38 భాషల్లో, సబ్ టైటిల్స్ తో పాటుగా, దాదాపు 240 దేశాల్లో విడుదల చేసారు.
ఈ సిరీస్ లో అనేక దేశాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ రావడంతో అక్కినేని అభిమానులు చాలా ఉత్సహంగా ఉన్నారు.
సినిమాలకి కూడా దక్కని పాన్ ఇండియా క్రేజ్, నాగచైతన్యకి మొదటి సిరీస్ తోనే పాన్ వరల్డ్ క్రేజ్ రావడంతో సిరీస్ బృందం కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు