Mallikarjun Kharge new face for PM I.N.D.I.A: ఇండియా కూటమిలో..ఆసక్తికర చర్చ.

In India.. an interesting alliance.

Mallikarjun Kharge new face for PM I.N.D.I.A: ఇండియా కూటమిలో.. ఆసక్తికర చర్చ.

ఆలు లేదు చూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అని వెనకటికి ఒక సామెత ఉంది, ఉంటె ఉంది అయినా ఇప్పుడు ఈ సామెత చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది,

సమయం సందర్భం లేకుండా మాట్లాడటాన్ని అసందర్భ ప్రేలాపన అంటారు అని తెలుసా అని అనేవారు ఉంటారు. అయితే ఈ సామెత చెప్పడానికి సరైన సమయమే.

ఈ మాట మనం కాబట్టి యధాలాపంగా పలికేశాము కానీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాత్రం ఇండైరెక్ట్ గా పలికారు. ఎలా అనే గా మీ సందేహం.

అయితే ఈ న్యూస్ మీకు విడమర్చి చెప్పాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో పాటుగా కొన్ని జాతీయ ప్రాంతీయ పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఆ కూటమి పేరే ఇండియా కూటమి,

Every body Surprise with CM Mamatha proposal:

Add a heading 2023 12 20T160223.015 Mallikarjun Kharge new face for PM I.N.D.I.A: ఇండియా కూటమిలో..ఆసక్తికర చర్చ.

ఈ కూటమిలో పలు ముఖ్య నేతలు ఉన్నారు. ఒక ముఖ్యమైన విషయంలో ఈ కూటమి ఢిల్లీ లో సమావేశమైంది.కాగా ఈ సమావేశంలో కొన్ని ఆశక్తికర విషయాలు వెలుగుచూశాయి.

అనుకోకుండా చోటుచేసుకున్న ఈ పరిణామాలు రాజకీయ నేతలనే కాక రాజకీయ విశ్లేషకులను కూడా ఆశ్చర్య పరిచాయి. అందులో ప్రధానమైన అంశం ఏమిటంటే పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ఒక కెలక ప్రతిపాదన చేశారు.

2024 లో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి తరుపున ప్రధాన మంత్రి అభ్యర్థి గా ఆమె మల్లికార్జున ఖర్గే పేరును ప్రతిపాదించారు.

అయితే ఈ ప్రతిపాదనకు అనూహ్యంగా ఢిల్లీ ముఖ్య మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేత అరవింద్ కేజ్రీవాల్ కూడా మద్దతు పలికారు.

Mamatha Benarji proposed kharge name:

Add a heading 2023 12 20T160533.823 Mallikarjun Kharge new face for PM I.N.D.I.A: ఇండియా కూటమిలో..ఆసక్తికర చర్చ.

ఇక మమతా బెనర్జీ ఈ ప్రతిపాదనను ఉన్నపళంగా తెరపైకి తీసుకురావడం కొంత ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఇండియా కూటమి తరుపున ప్రధాన మంత్రి

అభ్యర్థి ఎవరు అనే విషయం లో స్పష్టతను లోక్ సభ ఎన్నికల అనంతరం ఇస్తామని ఆమె అన్నారు. అయితే ఆ విషయం మమతా బెనర్జీ చెప్పి కొన్ని గంటల అనంతరమే ఆమె నోటితోనే స్వయంగా ఖర్గే పేరును ప్రతిపాదించడం

ఆశ్చర్యాన్ని కలిగించింది. పైగా ఇండియా కూటమి సమావేశం జరుగుతూ ఉండగా ఈ ప్రతిపాదన రావడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది.

12 parties accepted CM Mamatha proposal:

స్యయంగా మమతా బెనర్జీ నే మల్లికార్జున ఖర్గే పేరును ప్రధాన మంత్రి పదవికి ప్రతిపాదించడంతో ఆ సమావేశంలో సీన్ మారిపోయింది అని చెప్పొచ్చు. ఒక్కసారిగా 12 పార్టీలు ఆమె ప్రతిపాదనను సమర్ధించాయి.

ఆమె మాటకు మద్దతు పలికాయి. ఇక ఢిల్లీ ముఖ్య మంత్రి కేజ్రీవాల్ మాట్లాడుతూ ఇండియా కూటమి లో కాంగ్రెస్ పార్టీ నుండి ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న ఖర్గేను ప్రధాన మంత్రి పదవికి ప్రతిపాదించడం నిజంగా మంచి విషయమన్నారు.

దళిత సామజిక వర్గానికి చెందిన ఖర్గే ను ప్రధానిగా చేసుకోవడం వల్ల మొదటి దళిత జాతి నుండి వచ్చిన ప్రధానిగా ఖర్గే కి ఆ అవకాశం దక్కడం తో పాటు, దళిత జాతి అభ్యున్నతికి కూడా మంచి జరుగుతుందని వెల్లడించారు. పైగా దళిత జాతి వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకునే అవకాశం దక్కుతుందన్నారు.

Kharge given a big twist:

కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఎదురైంది. ఈ ప్రతిపాదనను ఎవరైనా వద్దు అని చెబితే ఆశ్చర్యం ఉండదు, అకాని స్వయంగా ఖర్గే నే లేచి ఆ ప్రతిపాదనను వద్దని చెప్పారు.

మమతా బెనర్జీ ప్రతిపాదనను అయన తోసిపుచ్చడంతో సమావేశంలో ఉన్న నేతలు సభ్యులు నిరాశకు గురయ్యారు. ఇందుకు అయన చెప్పిన కారణం ఒక్కటే,

కూటమి నుండి ఎవరినైనా ప్రధానిని చేయాలంటే మొదట కూటమికి కావలసిన మొత్తంలో సీట్లు రావాలని అన్నారు, అందుకు మనం లోక్ సభ సీట్లు గెలవాలని,

దానికోసం ఎలా పనిచేయాలి అనేదానిపై ప్రణాళిక రచించాలని పేర్కొన్నారు. కావలసినంత సంఖ్య లో ఎంపీ లు మనదగ్గర లేకుండా ప్రధాని అభ్యర్థిని ప్రకటించుకోవడంలో ఎంతమాత్రం ఉపయోగం ఉండదన్నారు.

అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే తాను ప్రధాని పదవి కోసం కాదని, పేదలకు మంచి జరగాలని కృషి చేస్తున్నానని అన్నారు. అణగారిన వర్గాల అభివృధే తన దెయ్యమని పేర్కొన్నారు.

Leave a Comment