తెలంగాణా లో మెగా డీఎస్సి కి కొలువుల జాతర ప్రక్రియ షురూ

website 6tvnews template 2024 03 04T172423.081 తెలంగాణా లో మెగా డీఎస్సి కి కొలువుల జాతర ప్రక్రియ షురూ

తెలంగాణా లో కంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే భారీ గా ఉద్యోగ నియామకాలు అలాగే అన్ని శాఖలలో ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేస్తామని చెప్పినట్లే ఈరోజున ఆ ప్రక్రియ మొదలు అయ్యిందని చెప్పచ్చు. కొద్ది రోజుల ముందు మెగా డీ ఎస్సి చేపడతామని చెప్పినట్లే దరఖాస్తుల స్వీకరణ ఈరోజు నుండి ప్రారంభించింది.

దీనికి సంబందించిన అన్ని వివరాలు ఈరోజు ప్రకటించింది. దీనికి సంబందించిన దరఖాస్తులు ఆన్ లైన్ లో నింపాలి అని తెలిపింది. అందులో అడిగిన అన్ని వివరాలు తెలియచేయాలని కోరింది. ఈరోజు నుండి ఏప్రిల్ 2 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పంపడానికి చివరి గడువు తేది గా నిర్ణయించారు.పరీక్ష ఫీజు క్రింద 1,000 రూపాయిలు గా నిర్ణయించారు.

అయితే పరిక్ష ఎప్పుడు జరిగేది ఇంకా చెప్పలేదు. కాని పరీక్షా కేంద్రాలుగా కొన్ని పట్టాణాలను ప్రకటించారు. అవి మహబూబ్ నగర్, రంగారెడ్డి ,హైదరాబాదు, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీమ్ నగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి లలో పరీక్షా కేంద్రాలు ఉంటాయని ఆయన చెప్పారు.ఈ మెగా డీ ఎస్సి ద్వారా హైదరాబాద్ లో 878 ఖాళీలు, నల్గొండ్ లో 605 ఖాళీలు, నిజామాబాద్ లో 601 ఖాళీలు, ఖమ్మం లో 757 ఖాళీలు, సంగారెడ్డి లో 551 ఖాళీలు, కామారెడ్డి లో 506 ఖాళీల ను భర్తీ చేస్తారని చెప్పారు.

Leave a Comment