పార్లమెంట్ ఎన్నికల నేపధ్యం లో CM రేవెంత్ ఢిల్లీ కి ప్రయాణం దానికోసమే !

748244 1481530 revanth reddy పార్లమెంట్ ఎన్నికల నేపధ్యం లో CM రేవెంత్ ఢిల్లీ కి ప్రయాణం దానికోసమే !

ఈరోజు ఢిల్లీ లో కాంగ్రెస్ పెద్దలను కలవడం కోసం తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. అయితే ఇక్కడ నేతలు అంత ఈ సారి ఎవరికీ టికెట్ దక్కుతుందా అనే సందేహాల నేపద్యం లో ఆయన ఢిల్లీ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఎంపి అభ్యర్ధుల గురించి చేపట్టిన అభిప్రాయాలను కాంగ్రెస్ పెద్దలతో చర్చిస్తామని CM చెప్పారు. అయితే కాంగ్రెస్ అభ్యర్దుల రెండో లిస్టు గిరించి ప్రధానంగా చర్చకు రానుంది. ఇప్పటికే 4 పార్లమెంట్ స్దానాలకు అభ్యర్ధులను ఎంపిక చెయ్యడం జరిగింది. ఇక మిగిలియా 13 స్దానాలకు ఎంపిక చెయ్యాల్సి ఉందని నేతలు చెప్తున్నారు. అయితే ఈ మీటింగ్ లోనే ఒక అభిప్రాయానికి రావచ్చని అందరు ఆశిస్తున్నారు.

రాబోయే లోక్ సభకి సంబందించి షెడ్యుల్ వస్తుందని ఈలోగానే అభ్యర్ధుల నిర్ణయం జరిగి వారి పేర్లు ప్రకటించాలని అనుకుంటున్నట్లు వారు చెప్పారు. అయితే ఇప్పటికే 15 స్దానలకు BJP తన అభ్యర్ధులను ప్రకటించడం జరిగింది.

కాంగ్రెస్ కూడా తన అభ్యర్ధులను తొందర్లోనే ప్రకటిస్తుందని హైదరాబాద్ లోని గాందీ భవన్ నేతలు చెప్తున్నారు.అయితే ఇప్పటికే అభ్యర్దుల గురించి పూర్తి అభిప్రాయ సేకరణ కొంత వరకు పూర్తి చేసామని మిగిలిన విషయాలు ఇంకా చర్చించాల్సి ఉందని కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇంచార్జి దీపాదాసు మున్షి తెలిపారు.

Leave a Comment