IND vs ENG Test Match Victory : విశాఖపట్నం వేదికగా జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను భారత్ 106 పరుగుల తేడాతో చిత్తు చేసింది. టీమ్ ఇండియా నిర్దేశించిన 399 పరుగుల లక్ష్య ఛేదనలో నాలుగో రోజు రెండో సెషన్‌లోపే ఇంగ్లాండ్ 292 పరుగులకు ఆలౌటైంది.
జాక్ క్రాలే (73) హాఫ్ సెంచరీ సాధించాడు. జస్‌ప్రీత్ బుమ్రా (3/46), రవిచంద్రన్ అశ్విన్ (3/72) అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇంగ్లాండ్ నుంచి ప్రతిఘటన ఎదురైనప్పటికీ..
కీలక సమయాల్లో వికెట్లు తీసిన భారత్ గెలిచి ఐదు టెస్టుల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. మూడో టెస్టు మ్యాచ్ ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా ప్రారంభం కానుంది.
స్కోరు వివరాలు:
భారత్: తొలి ఇన్నింగ్స్ 396/10. రెండో ఇన్నింగ్స్ 255/10
ఇంగ్లాండ్: తొలి ఇన్నింగ్స్ 253/10. రెండో ఇన్నింగ్స్ 292/10