హాంకాంగ్(Hongkong) స్టాక్ మార్కెట్ కుప్ప కూలింది, హాంకాంగ్ స్టాక్ మార్కెట్ దెబ్బ తింటే అంత విశేషంగా చెప్పాల్సిన వసరం ఏముంది అని సందేశం రావచ్చు.
ఇక్కడే అసలు విషయం ఉంది. చైనా(China) ఆర్ధిక వ్యవస్థకు కీలకమైన కొన్ని అంశాలు హాంకాంగ్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యి ఉన్నాయి. దాని వల్ల హాంకాంగ్ స్టాక్ మార్కెట్ చతికిల పడటం వల్ల చైనా స్టాక్ మార్కెట్ కి కూడా ఆ సెగ తగులుతుంది.
ఇక ప్రస్తుతం చూస్తే చైనా దేశం మొన్నటి వరకు అత్యధిక జనాభా కలిగి ఉండేది, కానీ ఆ స్థానాన్ని ఇప్పుడు భారత్(India) అధిగమించింది. ఎక్కువ జనాభా ఉండటం వల్ల మాన్ పవర్ కు ఎక్కడ లోటు ఉండదు కాబట్టి వివిధ దేశాలకు చెందిన పెట్టుబడిదారులు తమ తమ కంపెనీలను భారత్ లో విస్తరించేందుకు, కొత్తవాటిని స్థాపించేందుకు ముందుకు వస్తున్నారు.
A stable political environment : సుస్థిరమైన రాజకీయ వాతావరణం
పైగా భారత దేశంలో సుస్థిరమైన రాజకీయ వాతావరణం కనిపిస్తోంది అన్నది కూడా ఒప్పుకోక తప్పని నిజం. ప్రపంచ వ్యాప్తంగా ప్రధాని మోదీ(PM Narendra Modi)కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి, వరల్డ్ వైడ్ గా ఫెమస్ పొలిటీషియన్ గా కానీ, లేదంటే మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా కానీ ఆయన పేరే వినిస్తు ఉంటుంది.
ఇది కూడా మరో కారణంగా భావించవచ్చు అంటున్నారు ఆర్ధిక నిపుణులు. కాబట్టి చైనా, హాంకాంగ్ మార్కెట్లకు ప్రతికూల వాతావరణం ఎదురవ్వడం, వారికి ఎదురుగాలి వీయడం కూడా భారత్ కి కలిసొచ్చే అంశం అని అంటున్నారు.
చైనా పతనానికి కారణాలు : Reasons for Down fall of China
ముఖ్యంగా చైనా అభివృద్ధికి బ్రేకులు పాడటానికి ప్రధాన కారణాలు చూస్తే, ముఖ్యమైనది కరోనా వైరస్ ఆంక్షలు(Corona virus restrictions).
ఆతరువాత ఆదేశంలో తలెత్తిన సంక్షోభం మరో కారణమైంది. పైగా ఇవి చాలవన్నట్టు పశ్చిమ దేశాలతో చైనా కి తలెత్తిన భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు కూడా చెప్పుకోవచ్చు.
వీటి ప్రభావం తోనే చైనా స్టాక్ మార్కెట్ కూలిపోయింది. అదే ఇప్పుడు హాంకాంగ్ స్టాక్ మార్కెట్ కూలడానికి కారణభూతమైంది.
భారత్ ఆ మైల్ స్టోన్ దాటేసింది : India has crossed that milestone
ఈ పరిణామాల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్(India Stock Market) ఒక మైల్ స్టోన్ ను దాటేసింది అనే చెప్పాలి.
ఇండియన్ స్టాక్ ఎక్స్ చేంజ్(Indian Stock Exchange) లో లిస్ట్ చేయబడ్డ మొత్తం స్టాక్స్ వాల్యూ చుస్తే మతి పోవాల్సిందే, జనవరి 22వ తేదీ నటిని దాని విలువ 4.33 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.
ఇక గతఏడాది అంటే 2023 డిసెంబర్ నెలలోనే దేశీయ మార్కెట్ విలువ 4 ట్రిలియన్ డాలర్లను దాటేసింది. తాజాగా హాంకాంగ్ స్టాక్ మార్కెట్ 4.29 గా ఉన్న దానిని భారత్ దాటుకుని ముందుకు వెళ్లి 4.33 ట్రిలియన్ డాలర్లకు చేసుకుంది.
దీని వల్ల భారత్ వరల్డ్ వైడ్ గా నాలుగో అతిపెద్ద ఈక్విటీ మార్కెట్(Largest Equity Market) గా అవతరించింది.