T20I Cricket: పాక్ రికార్డుని బద్దలు కొట్టిన భారత్.
రాయ్‌పూర్ లో జరిగిన టీ20ఐ లో ఆస్ట్రేలియా పైన 20 పరుగుల తేడా తో ఇండియా ఘన విజయం సాధించింది.ఇప్పటివరకు పాక్ రాసుకున్న చరిత్రను ఒక్క దెబ్బతో భారత్ తిరగరాసింది.
షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టడీయంలో జరిగిన నాలుగవ టీ20ఐ లో ఆస్ట్రేలియా పైన గెలిచి, మెన్ ఇన్ బ్లూ 136 విజయాలతో చరిత్రలో తన పేరు సువర్ణాక్షరాలతో లిఖించుకుంది.
ఇప్పటివరకు 135 విజయాలతో పాక్ అగ్రస్థానంలో ఉండగా, భారత్ ఈ లెక్కని తారుమారు చేసిందిటీ20ఐ లో అధిక విజయాలు సాధించిన దేశాల జాబితా ను ఒక్కసారి గమనిస్తే
భారత్ :
టీ20 ఐ లో అత్యధిక విజయాలు సాధించిన దేశాలలో అగ్రస్థానం సంపాదించి భారత జట్టు, టాప్1లో చోటు దక్కించుకుంది.213 మ్యాచ్ లు ఆడిన భారత్ 136 మ్యాచ్ లలో గెలిచి విజయపంథాలో ముందుకు వెళ్తోంది.
పాకిస్తాన్ :
ఒకప్పుడు పాకిస్తాన్ జట్టు విజయాల జాబితాలో భారత్ కన్నా ఒక అడుగు ముందు ఉండేది, ఆస్ట్రేలియాతో భారత్ ఆడిన మ్యాచ్ లతో గెలవడంతో పాక్ ఒక అడుగు వెనకకి వేసి రెండవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
226 మ్యాచ్ లలో 135 మ్యాచ్లలో గెలిచింది:
- న్యూజిలాండ్ : పాకిస్తాన్ తర్వాత న్యూజిలాండ్ విజయాల జాబితాలో ముందుంది.
- ఆస్ట్రేలియా : భారత్ చేతిలో ఓడిపోయినా ఆస్ట్రేలియా
- 181 మ్యాచ్ లు ఆడితే అందులో 95 విజయాలు సాధించి ఔరా అనిపించింది.
- దక్షిణాఫ్రికా : 171 మ్యాచ్ లు ఆడిన సౌత్ ఆఫ్రికా 95 మ్యాచ్ లలో జయ కేతనం ఎగురవేసింది.
- ఇంగ్లాండ్ : 177 మ్యాచ్ లకు గాను 92 మ్యాచ్ లలో విజయం సాధించింది.
- శ్రీలంక : లంకేయులు 180 మ్యాచ్ లు ఆడి 79 మ్యాచ్ లలో విజయం సాధించారు.
- వెస్టిండీస్ : 184 మ్యాచ్ లలో 76 మ్యాచ్ ను సొంత చేసుకోగలిగారు.
- ఆఫ్ఘానిస్తాన్ : ఆ దేశం ఆటగాళ్లు 118 మ్యాచ్ లు ఆడి 74 మ్యాచ్ లలో విజయాన్ని తమ సొంతం చేసుకున్నారు.
- ఐర్లాండ్ :154 మ్యాచ్ లు ఆడి 64 మ్యాచ్ లో నిగిడి ఐర్లాండ్.