ఇప్పుడున్న పరిస్థితి లో ఇండియా అన్నింటి లో దూసుకు పోతోందని చెప్పవచ్చు. అది ఏ రంగ మైన. ఇక స్మార్ట్ ఫోన్స్ విషయానికి వస్తే తన అద్భుత ప్రతిభ తో ఇప్పుడు ఇండియా US కి 4.43 కోట్ల ఫోన్లను ఎక్స్ పోర్ట్ చేస్తోందని ఆర్ధిక రంగ నిపుణులు చెప్తున్నారు. వాణిజ్య మంత్రిత్వ శాఖ అంద జేసినా డేటా ప్రకారం చూస్తే కేవలం ఏప్రిల్ నుదం డిసెంబర్ వరకు US కి ఇండియా నుండి దాదాపు ఎక్స్ పోర్ట్స్ అస్ $3.53 బిలియన్ డాలర్లు కి చేరుకుంది. ఇక ఎక్స్ పోర్ట్స్ విషయం లో ఇండియా వాటా 7.76% కి పెరిగింది. క్రిందటి ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే 2% పెరిగిందని లెక్కలు చెప్తున్నాయి.
ఇప్పడు ఇండియా లో పెరుగుతున్న ఎక్స్ పోర్ట్స్ భారత దేశ సరిహద్దులు దాటి చాల దేశాలకు విస్తరించిందని ఆర్ధిక గణంకాలు చెప్తున్నాయి. అయితే ఇండియా యొక్క స్మార్ట్ ఫోన్స్ ఎక్స్ పోర్ట్స్ ఆయా మార్కెట్ లమీద ప్రభావితం చూపిస్తుందని నిపుణులు చెప్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల బట్టి US కి స్మార్ట్ ఫోన్స్ ఎక్స్ పోర్ట్స్ చేసే దేశాలలో భారత్ డి 3 వ స్దానం అని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఆర్ధిక గణంకాలు చూస్తే చైనా, వియత్నాం మార్కెట్ విలువ మొదటి 9 నెలల మార్కట్ వాటా చూస్తే భాగా క్షీణించినదని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.
దీని ప్రకారం చూస్తే మార్కెట్ విలువ 2023 సంవత్సరానికి $45 .1 బిలియన్ డాలర్లు కు పడిపోయాయని భారత ఆర్ధిక నిపుణులు చెప్తున్నారు. ఈ పరిస్థితులలో చైనా మార్కెట్ గణ నీయంగా పడిపోయిందని చెప్పవచ్చు. అలాగే వియత్నాం కుడా తన ఎక్స్ పోర్ట్స్ కూడా మార్కెట్ వాటా క్షీణించి అతి తక్కువగా 94 లక్షల కు పడిపోయింది.
ఇండియా నుండి స్మార్ట్‌ఫోన్ ఎగుమతి కేవలం సంఖ్యల గురించి మాత్రమే కాదు, ప్రపంచ సరఫరాలో దాని పెరుగుతున్న సామర్థ్యాలతో పాటు వ్యూహాత్మక స్థానాలకు ఇది నిదర్శనం చెప్పాలి. ప్రస్తుత పరిస్థితులలో అమెరికన్ కంపెనీలు చైనాను నమ్మే పరిస్థితి లేదని అందుకనే దూరంగా తమ తయారీ స్థావరాలను ఇండియా కు విస్తరించడంతో, ఈరోజు ప్రపంచ స్మార్ట్‌ఫోన్ ల మార్కెట్‌లో ఇండియా మరింత వృద్ధికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది.
ఈ మార్పు డైనమిక్స్‌ను సవాలు చేయడమే కాకుండా ప్రపంచం లోనే స్మార్ట్‌ఫోన్ ల తయారీ కేంద్రంగా ఇండియా సామర్థ్యాన్ని ఏంటో ఈరోజు ఇతర దేశాలకు చూపుతోంది. అంతే కాకుండా నిరంతర పెట్టుబడి అలాగే మద్దతుతో, ఇండియా స్మార్ట్‌ఫోన్ ఎక్స్ పోర్ట్ రాబోయే రోజుల్లో కొత్త రికార్డులను నెలకొల్పే దిశ గా ఇండియా పయనిస్తోందని అని చెప్పవచ్చు.