‘భారతదేశం మంటల్లో ఆహుతి ‘ రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు – ఖండించిన మోడీ !

website 6tvnews template 2024 04 02T140420.121 'భారతదేశం మంటల్లో ఆహుతి ' రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు - ఖండించిన మోడీ !

‘India is on fire’ Rahul’s extreme comments – condemned by Modi! : ఉత్తరాఖండ్‌లో జరిగిన బహిరంగసభ లో ప్రసంగిస్తూ BJP మూడోసారి అధికారం చేపడితే భారతదేశం అగ్నికి ఆహుతి అవుతుందని రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు తీవ్రం గా విమర్శించారు.

రాహుల్ గాంధి అలా అనడం ప్రజాస్వామ్యం కు విరుద్దం అని నరేంద్ర మోదీ అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఆదివారం జరిగిన AAP చేపట్టిన రాంలీలా మైదాన్ ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రధాని మోడీ ఎన్నికలను మ్యాచ్‌ని ఫిక్స్ చేశారని, అందుకే సరిగ్గా ఎన్నికలకు ముందే ఇద్దరు ముఖ్యమంత్రులను జైలుకు పంపించారు అన్నారు.

ఈ ఫిక్స్‌డ్ ఎలక్షన్స్‌లో బీజేపీ గెలిచి అధికారం చేపడితే మాత్రం రాజ్యాంగం మొత్తం మార్చేస్తారని విమర్శించారు. అలా చేస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తే దేశం మంటల్లో కూరుకుపోతుందని, అందరు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని రాహుల్ గాంధీ ఆరోపించారు.

‘దేశం మూడోసారి BJP గెలిపించి అధికారం ఇస్తే అది దేశానికి చాలా ప్రమాదమని అది నిప్పు తో సమానమని కాంగ్రెస్ షాహీ కుటుంబానికి చెందిన షాజాదా పిలుపుని ఇవ్వడం జరిగించి. 70 ఏళ్లపాటు మీరు దేశాన్ని పాలించిన మీరు పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉన్నారు. అందుకే ఇలా మాట్లాడుతున్నారు అని మోడీ విమర్శించారు.

కాంగ్రెస్ కు అధికారమే కావాలి కాని దేశ అభివృద్ధి అవసరం లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు గురించి దేశ ప్రజలకు తెలుసు అని వారు దేశానికి ఎం చేసారనేది కుడా తెలుసు అని ఇప్పుడు దేశం అభివృద్ధి లో దూసుకుపోతుందని అది చూడలేక ఇలాంటి విమర్శలు చేస్తున్నారు అని మోడీ దుయ్య బట్టారు.

Leave a Comment