India Playing XI : సౌతాఫ్రికాతో ఆడే భారత తుది జట్టు చూశారా ? జట్టులో ఎవరు ఇన్ ఎవరు అవుట్ తెలుసా ?
వన్ డే ప్రపంచ కప్ లో ముఖ్యంగా రెండు దేశాలు ప్రత్యర్థి ఆటగాళ్లకు చెమటలు పట్టిస్తున్నాయి. వారిలో భారత్ ఒకటైతే రెండవది సౌత్ ఆఫ్రికా. వీటిలో భారత్ ఇప్పటివరకు 7 మ్యాచులు ఆడితే ఒక్కదానిలో కూడా ఓడిపోయింది లేదు.
ఇక సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే ఈ దేశం 7 మ్యాచులు ఆడగా అందులో ఆరింట గెలిచి ఒకదానిలో పరాజయాన్ని చవిచూసింది. మరి ఈ రెండు దేశాలు కూడా పాయింట్ల పట్టికలో మంచి స్కోరునే నమోదు చేసుకున్నాయి.
ఇక ఈ రెండు దేశాలు తలపెడితే క్రికెట్ అభిమానులకు కన్నుల విందుగా ఉంటుంది అని చెప్పొచ్చు. భారత దేశం చిన్న చిన్న దేశాలపై నెగ్గడం కంటే మంచి ఫామ్ లో ఉన్న దేశంపై తలపడి విజయం సాధిస్తే ఫాన్స్ కి తప్పకుండా అది పండుగను తలపిస్తుంది.
మరి ఇండియా vs సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కూడా ఆ కోవలోకే వస్తుంది అని నిస్సంకోచంగా చెప్పొచ్చు. తాజాగా భారత్ శ్రీలంక పై నెగ్గి, సెమిస్ లో బెర్తు కన్ఫర్మ్ చేసుకోవడమే కాక వన్డే వరల్డ్ కప్ లో అతిపెద్ద రెండవ విజయాన్ని సాధించిన దేశంగా కీర్తికెక్కింది.
ఇక ఇండియా vs సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కు కోల్కత్త లోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం ఆతిధ్యం ఇవ్వనుంది. ఇప్పటికే భారత్ సౌత్ ఆఫ్రికా జట్లు అక్కడికి చేరుకున్నాయి కూడా.
ఇక ఆ దేశ జట్టులోని డికాక్, వాన్ డెర్ డస్సెన్, మార్క్‌రమ్ వంటి ముగ్గురు ఆటగాళ్లు మంచి ఫామ్ లో ఉన్నారు. అయితే మన భారతబౌలర్లు తక్కువేం తినలేదు, ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ల వికెట్లు టప టపా పిట్టల్లా రాలి పోతున్నాయి.
మన బౌలర్లు విసిరే బంతులకు స్టెంపులు గాలిలోకి లేస్తున్నాయి. రెండు బలమైన జట్ల మధ్య మ్యాచ్ అంటే రెండు మత్తగజాలు ఫైట్ కి దిగినట్టే ఉంటుంది అంటున్నారు విశ్లేషకులు.
ఇక భారత జట్టులో అయితే ఎలాంటి మార్పులు చేసే అవకాశం కనిపించడం లేదు.
కేవలం హార్దిక్ పాండ్య మాత్రం పూర్తిగా కోలుకోలేకపోవడం వల్లనే ఈ దఫా ఆటకు దూరం కావలసి వస్తోంది. అయితే నెదర్లాండ్స్ తో జరిగే మ్యాచ్ సమయానికి అతడు పూర్తిగా కోలుకుని జట్టులో జాయిన్ అవుతాడని పాండ్య ఫాన్స్ ఆశిస్తున్నారు.
ప్రస్తుతం టీమ్ ఇండియా బాగా ఆడుతుండటం తో జట్టులో ఎటువంటి మార్పులు చేర్పులకు ఆస్కారం ఉన్నట్టు కనిపించడం లేదని అంటున్నారు క్రికెట్ అభిమానులు.
అంతేకాదు మొన్నటివరకు కాస్త వెనకబడ్డ శ్రేయాస్ అయ్యర్ కూడా శ్రీలంక తో జరిగిన మ్యాచ్ లో చెలరేగిపోయాడు. ఈడెన్ గార్డెన్స్ లోని పిచ్, స్పిన్ కి అనుకూలం అయితే గనుక, టీమ్ ఇండియా అశ్విన్ ను జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంటుంది.
అశ్విన్ జట్టులోకి వస్తే సిరాజ్ కి ఛాన్స్ మిస్ అవుతుంది. ఇప్పటికే టీమ్ ఇండియా ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేసింది కాబట్టి, ప్రయోగాలు చేసే ఛాన్సులు కూడా తక్కువే అంటున్నారు.
ఒకవేళ జట్టులోని ఎవరైనా ఒక స్పిన్నర్ కి రెస్ట్ ఇవ్వాలంటే ఆ ప్లేస్ ను శార్దూల్ తో భర్తీ చేస్తారు. ప్రస్తుతం మన జట్టులో చుస్తే రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా ఉన్నారు.