Maldives in the budget 2024: మనదేశంపైన మనదేశ పర్యాటకం పైనా విషం కక్కిన మాల్దీవ్స్(Maldives) కు భారత సర్కారు గట్టిగానే బుద్ది చెప్పింది. ఇప్పటికే మనదేశంలో ఉన్న లక్ష్యదీప్ ఐలాండ్స్(Lakshadweep) అభివృద్ధికి బాటలు పడుటం ఆదేశానికి మిగుడుపడని అంశగా మారింది. ఇది చాలదన్నట్టు 2024 -25 బడ్జెట్ లో కూడా మాల్దీవ్స్ కు నిర్ఘాంతపోయే పరిణామాలే ఎదురయ్యాయి.
భారత దేశం(India) విదేషాలకు ఇచ్చే గ్రాంట్ లలో కోత విధిస్తూ బడ్జెట్ ను ప్రవేశ పెట్టి వారిని షాక్ అయ్యేలా చేసింది. ఈ ఏడాది బడ్జెట్ లో మాల్దీవ్స్ కి భారత్ ఇచ్చే గ్రాంట్ నుండి 22 శాతం కోత విధించారు. అయితే ఈ నిర్ణయం చాలా సమర్ధనీయం అంటున్నారు చాలామంది. మాల్దీవ్స్ మన దేశ పర్యాటక రంగం మీద ఇష్టారీతిన మాట్లాడుతూ చెలరేగిపోవడమే కాకుండా మన శత్రు దేశమైన చైనా(China) తో అంటకాగటం మరీ గర్హనీయమన్నారు.
ఈసారి 600 కోట్లే : Only 600 Crores In This Academic Year
మాల్దీవ్స్ కు భారత దేశం అభివృద్ధి నిమిత్తం ప్రతి ఏటా కొంత గ్రాంట్లు ఇస్తూ ఉంటుంది. అయితే ఈ ఏడాది ఆ గ్రాంటును 22 శాతానికి కుదించింది. అంటే గతంలో 770.90 కోట్ల గ్రాంటును ఇవ్వగా దానిని ఇప్పుడు 600 లకు కుదించింది.
2023-24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి చూసుకుంటే 22 శాతం తగ్గినట్టే. అయితే 2022 -23 ఆర్ధిక సంవత్సరం లో ఇచ్చిన గ్రాంటును చూస్తే ఆశ్చర్యపోతారు. ఆయేడాదికి భారత్ మాల్దీవ్స్ కి ఇచ్చిన గ్రాంట్ కేవలం 183.16 కొట్లు మాత్రమే. అంటే మరుసటి యేడాదికి భారత్ మాల్దీవ్స్ కి ఇచ్చే గ్రాంటును ధారాళంగా పెంచేసింది. 300 శాతం పెంచి 770.90 కోట్లు ఇచ్చింది. ఈ గ్రాంట్లను భారత్ మాల్దీవ్స్ లోని రక్షణ, విద్య, ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతుల కల్పనకు ఇస్తూ వస్తోంది.
గ్రాంట్ పెరిగిన దేశాలు కూడా ఉన్నాయి : There are also countries where the grant has increased
ఈ గ్రంట్కాను తగ్గించే విషయం కేవలం ఒక్క మాల్దీవ్స్ కి మాత్రమే కాక ఇతర దేశాలకు కూడా కొంత కోత పెట్టింది భారత్. 2023-24 సంవత్సరానికి గాను 5426.78 కోట్ల బడ్జెట్ ను కేవలం విదేశాలకు ఇచ్చే గ్రాంట్లకోసం కేటాయించగా 2024-25 ఆర్థికసంవత్సరంలో దానిని 4883.56 కోట్లకు కుదించింది. దీనిని బట్టి చూస్తే పది శాతం కోత పెట్టినట్టు అర్ధం అవుతోంది.
ఈ ఏడాది కేటాయింపులు తగ్గిన దేశాలే కాదు గ్రాంట్ల కేటాయింపు పెరిగిన దేశాలు కూడా ఉన్నాయి సుమండీ, భారత్ మన పొరుగు దేశమైన శ్రీలంక (Srilanka)కు గ్రాంట్ ను ఈ ఏడాది కొంత పెంచి మంచి మనసు చాటుకుంది. శ్రీలంక తోపాటు ఆఫ్రికా దేశాలు(Africa Countries), మారిషస్(Mauritius), సీషెల్స్(Seychelles)లకు కూడా గ్రాంట్ల కేటాయింపు కాస్త పెరిగింది.