Indian 5 Trillion dollar economy : భారత దేశ ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ సమీప భవిష్యత్తులో 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. అది అంత తేలికైన విషయమా?

భారతీయ జనతా పార్టీ తుది జాబితాను విడుదల చేసిన నేతలు 18 Indian 5 Trillion dollar economy : భారత దేశ ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ సమీప భవిష్యత్తులో 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. అది అంత తేలికైన విషయమా?

Indian 5 Trillion dollar Economy : భారత దేశ ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ సమీప భవిష్యత్తులో 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. అది అంత తేలికైన విషయమా?

భారత దేశ ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ సమీప భవిష్యత్తులో 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ఏంటి ఆశా మాషీగా ఉందా ? అది అంత తేలికైన విషయమా ? అని ఎవరికైనా అడగలనిపిస్తుంది ఈ స్టేట్మెంట్ చుస్తే, కానీ ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మాత్రం ఇది దుస్సాధ్యం కాదు సుసాధ్యమే అని చెబుతోంది.

పైగా ఈ విషయాన్ని మార్చ్ 14 వ తేదీన రాజ్యసభలో చెప్పింది. 2026 – 27 నాటికి భారత దేశ ఆర్ధిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది అని పేర్కొంది. అయితే ఆనాడు రాజ్య సభలో ఉన్న ప్రతిపక్షాలు మాత్రం ఇది ఎంతమాత్రం సాధ్యం కాదని తేల్చి చెప్పాయి. పైగా 5 ట్రిలియన్ డాలర్లా అంటూ అపహాస్యం చేశాయి.

కానీ ప్రస్తుత నివేదికల ప్రకారం భారత దేశ ఆర్ధిక వ్యవస్థ 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది ఎలా సాధ్యమైంది అనే విషయలు ఒక్కసారి చూద్దాం.

చారిత్రక మైలు రాయి.

భారతదేశం 2023 నాటికి 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారింది. ముందుగా ఈ మాట మాత్రం చాలా సంతోషించదగిన మాట, భారతతీయులుగా మనం చాలా గర్వించదగిన మాట. భారతదేశం ఆర్ధికంగా మరో మెట్టు ఎదిగి ఆర్ధికంగా స్థిరత్వం పొందిన దేశాల సరసకు చేరుతోంది అని చెప్పడానికి వీలుపడే మాట.

ఇది భారతదేశ చరిత్ర లోనే చారిత్రిక మైలురాయి వంటిది. ఈ మాట మన దేశ ఆర్ధిక పురోగతిని సూచిస్తుంది. మన దేశం ఆర్ధికంగా ఎంత ముందుకు వెళుతుందో ఈ మాట వింటే మనకు అర్ధమైపోతుంది.

ఇక మనదేశం ఈ ఘనత సాధించడానికి అనేక కారణాలు ఉన్నాయి, వాటిలో ప్రధానమైన కారణాలు ఏమిటనేది చూద్దాం.

2022-23 మన దేశ జీడీపీ.

భారతీయ జనతా పార్టీ తుది జాబితాను విడుదల చేసిన నేతలు 19 Indian 5 Trillion dollar economy : భారత దేశ ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ సమీప భవిష్యత్తులో 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. అది అంత తేలికైన విషయమా?

ఈ కారణాలలో ప్రధానమైనది ప్రధమమైనది వేగవంతమైన వృద్ధి భారతదేశం గత కొన్ని సంవత్సరాలుగా అధిక వృద్ధి రేటును నమోదు చేసింది. భారతదేశం ఒక దశాబ్దం క్రితంతో పోల్చుకుంటే ఆర్ధికంగా పరిపుష్టత సాధించింది అని కూడా గట్టిగానే చెప్పొచ్చు.. అందుకు ఉదాహరణే 2022-23 ఆర్థిక సంవత్సరంలో, మన దేశం నమోదు చేసిన జీడీపీ, 2022-23 లో మన దేశం స్థూల దేశీయోత్పత్తి 8.7 గా నమోదైంది.

అయితే ఈ దేశం స్థూల దేశీయోత్పత్తి 8.7 నమోదు అవడానికి ఏయే అంశాలు దోహదపడ్డాయి అంటే మొదటగా చెప్పాల్సింది దేశీయ డిమాండ్ పెరుగుదల- దేశీయ డిమాండ్ పెరుగుదల అనేది ఒక దేశంలోని వినియోగదారులు ఇంకా పరిశ్రమల కొనుగోళ్లను పెంచే ప్రక్రియ గా చెప్పబడుతుంది.

ఇది ఆర్థిక వృద్ధికి ఒక ప్రధాన కారకంగా చెప్పబడుతుంది. ఎందుకంటే ఇది ఉత్పత్తి తోపాటు ఉపాధిని పెంచుతుంది. భారతదేశంలో,

ఆర్ధిక సంస్కరణల్లో కేంద్రం పాత్ర.

భారతీయ జనతా పార్టీ తుది జాబితాను విడుదల చేసిన నేతలు 20 Indian 5 Trillion dollar economy : భారత దేశ ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ సమీప భవిష్యత్తులో 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. అది అంత తేలికైన విషయమా?

దేశీయ డిమాండ్ పెరుగుదల గత కొన్ని సంవత్సరాలుగా ఒక ముఖ్యమైన శక్తిగా మారింది. అందుకు కారణం కూడా లేకపోలేదు. మన దేశ ప్రధాని మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అనే నినాదాన్ని తీసుకురావడంతో ఆయనను అనుసరించే అనేక మంది ఈ నినాదాన్ని తూచా తప్పకుండా ఫాలోఅయ్యారు. ఇక భారత దేశ ప్రధానిని ఎంత మంది అనుసరిస్తుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు.

సామాజిక మాధ్యమాలలో ఆయనను కోట్ల మంది ఫాలో అవుతూ ఉంటారు. అయన ఒక్క సారి మన్ కీ బాత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించగానే అనేకమంది అయన మనసులో నుండి వచ్చే మాటలను వినేందుకు తయారు గా ఉంటారు. అయన మనకి ఈ సారి ఏ సందేశం ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు.

అటువంటిది అయన మనదేశంలో తయారైన వస్తువులనే మనం వినియోగించుకుందాం అనే మాట చెప్పగానే అనేక మంది ఆ మాటను అనుసరించడం మొదలు పెట్టారు. అప్పటి నుండి దేశీయంగా ఉత్పత్తి అయ్యే వాటినే వినియోగించడం ఆరంభించారు.

మరీ ముఖ్యంగా కరోనా సమయం నుండి చైనా ఉత్పత్తులను చాలా దూరంగా ఉంచడం ప్రారంభించారు.

కరోనా ఒడిదుడుకులు రాకుండా ఉంటె.

కరోనా సమయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ సమయంలో ఎక్కడికక్కడ పరిశ్రమలు నిలిచిపోయాయి. ఒక్క పరిశ్రమ నిలిచిపోయిందంటే ఆ పరిశ్రమకు వేళల్లో నష్టం వస్తుంది, కానీ ఒక ఊరు కాదు ఒక మండలం కాదు ఒక జిల్లా కాదు ఒక రాష్ట్రం కాదు యావత్ దేశంలోని పరిశ్రమలు అన్ని మూట పడితే ఎలా ఉంటుంది ? ఎంత నష్టం వాటిల్లుతుంది.

ఆనష్టాన్ని లెక్కకడితే అది వేల కోట్లలో ఉంటుంది. కోట్లలో ప్రజలు ఉపాధి కోల్పోతారు. మరి అటువంటి ఉపాధి కోల్పోయిన వారందరికీ ప్రభుత్వమే జీవనం కొనసాగించడానికి ఆహార ధాన్యాలు సరఫరా కూడా చేయాలంటే అది ఎంత కష్టంగా మారుతుందో అంచనా వేస్తె అది మరికొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుంది.

పరిశ్రమలు మూత పడ్డాయి అంటే ఎగుమతులు దిగుమతులు నిలిచిపోతాయి, దానివల్ల దేశానికి ఆర్ధిక వనరు కూడా నిలిచిపోతుంది. ఒకపక్క ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న సమయంలోనే దేశ ప్రజలకు ఆహార ధాన్యాలను సంక్షేమ పధకాల రూపం లో అందజేయడం అంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. దేశ ఖజానాకు అది మరింత ఆర్ధిక భారాన్ని పెంచుతుంది.

మెడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా.

భారతీయ జనతా పార్టీ తుది జాబితాను విడుదల చేసిన నేతలు 21 Indian 5 Trillion dollar economy : భారత దేశ ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ సమీప భవిష్యత్తులో 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. అది అంత తేలికైన విషయమా?

అయితే మన దేశాన్ని అటువంటి ప్రతికూల సమయంలో కూడా విభిన్నమైన రీతిలో ముందుకునడిపించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు, ఒకే మాటతో అటు శాంత్రి దేశం చైనాకి బుద్ధి చెప్పడంతో పటు మన దేశానికి ఆర్ధికంగా వృద్ధి పెరిగేలా చేశారు.

అదే మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా. మేడ్ ఇన్ ఇండియా నినాదం తో ఎక్కువ మంది ప్రేరేపితులయ్యారు. ఆ నినాదం వల్ల చైనా ఉత్పత్తులను వీధుల్లోకి తీసుకొచ్చి విరగ్గొట్టి తమ మనస్సులో ఉన్న క్రోధాన్ని భారతీయులు వెళ్ళగ్రక్కారు. అందుకు కారణం చైనా నుండి వ్యాపించిన కరోనా మహమ్మారి వైరస్.

ఆ వైరస్ వల్ల నెలల తరబడి అనేక మంది ఇళ్లకే పరిమితమవడం ఒకటయితే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తల్లి దండ్రులను కోల్పోయిన బిడ్డలు అనేక మంది. అయితే ఇరువంటి వారి చదువుల కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని పధకాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే అన్నిటికి మించి కేంద్రం మరలా మన దేశ ఆర్ధిక స్థితిని గాడిలో పెట్టేందుకు మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అనే నినాదాన్ని బాగా ఉపయోగించుకుంది.

వ్యవసాయం ఏ మేరకు తోడ్పడుతుంది.

దేశం అభివృద్ధి పధంలో ముందుకి వెళ్లాలంటే ముఖ్యమైన రంగాల్లో వ్యవసాయ రంగం కూడా ఒకటి. అందుకే మన దేశ ప్రభుత్వం వ్యవసాయ రంగం మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. వ్యవసాయం చేసేవారికి అన్ని రకాలుగా చేదోడు వాదోడు గా ఉంటూ వస్తోంది.

వయ్వసయంలో రాను రాను కూలీలా కొరత ఏర్పడడంతో యాంత్రీకరణ ను ప్రవేశ పెడుతూ వస్తోంది. ఈ యాంత్రీకరణ చేయడమే కాక వాటిని సబ్సిడీ రూపంలో తక్కువ ధరలకు చిన్న సన్నకారు రైతులకు అందిస్తూ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. అంతే కాక వ్యవసాయం చేసుకునే సమయంలో వారికి ఆర్ధికంగా సహాయం అందించడం కోసం పీఎం కిసాన్ యోజన కింద నగదు కూడా అందిస్తోంది.

ఈ నగదును విడతల వారీగా వారి బ్యాంకు ఖాతాలకు అందిస్తోంది. మరీ ముఖ్యంగా రైతులు పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసేందుకు సహకారం అందిస్తూ వస్తోంది. ఈ పంటకు ఎగుమతులకు అనుమతులు ఇవ్వడం ద్వారా రైతులకు లాభం చేకూరడమే కాక ఎగుమతుల వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థకు కూడా లాభాన్ని తెచ్చి పెడుతోంది.

పారిశ్రామికీకరణ

పరిశ్రమలు మనదేశ అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయి. అలాంటి పరిశ్రమలే లేకుండా ఉంటె కరోనా వంటి క్లిష్ట సమయంలో మనదేశంలో కరోనా కి టీకానే తయారై ఉండేది కాదు. కాబట్టి పరిశ్రమలు దేశ అభివుద్ధికి ఎంతగానో తోడ్పడతాయి. పరిశ్రమలు పెట్టుబడుల గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా చెప్పుకోవలసింది 1990 వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల గురించి.

ఆనాటి ప్రభుత్వం విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరచి దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడింది. అలా తీసుకువచ్చిన సంస్కరణ వల్ల మనదేశం ఆనాడు ఒక ట్రిలియన్ అభివృద్ధిని సాధించగలిగింది. అయితే వేగవంతమైన అభివృద్ధి సాధించలేకపోవడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి.

2014 నాటికి మన దేశ ఆర్ధిక వృద్ధి 2 ట్రిలియన్ డాలర్లకు చేసుకుంది అంటే ఎంత నెమ్మదిగా పయనించింది అనేది అర్ధం చేసుకోవచ్చు. పారిశ్రామిక రంగం పెరగడం వల్ల ఆ పరిశ్రమల్లో నేరుగా ఉద్యోగాలు పొంది ఉపాధి పొందే వారు కొందరైతే, ఆ పరిశ్రమలపై ఆధారపడి జీవనాన్ని సాగిస్తూ పరోక్షంగా లబ్ది పొందేవారు మరికొందరు ఉంటారు.

అలా అనేక మంది లబ్ది పొందుతూ ఉన్నారు. మనదేశంలో ఒక సంస్థ తన వాస్తు ఉత్పత్తి కోసం పరిశ్రమను స్థాపించింది అంటే వాటి అనుబంధ సంస్థలు కూడా ఇక్కడే పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. లేదంటే అందులో ఉపయోగించే వసతులను ఇక్కడకు పంపించడం కోసం భారత దేశ రవాణా వ్యవస్థనైనా ఉపయోగించాల్సి ఉంటుంది. తద్వారా అనేకమైన విధాలుగా దేశ ఆర్ధిక వృద్ధికి తోడవుతాయి పరిశ్రమలు.

మహాత్మా గాంధీ ఏమన్నారంటే.

భారతీయ జనతా పార్టీ తుది జాబితాను విడుదల చేసిన నేతలు 22 Indian 5 Trillion dollar economy : భారత దేశ ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ సమీప భవిష్యత్తులో 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. అది అంత తేలికైన విషయమా?

మహాత్మా గాంధీ ఒక మాట చెప్పారు, ఏ ఊరికైతే రవాణా సౌకర్యం బాగుంటుందో ఆ ఊరు త్వరగా అభివృద్ధి చెడుతుంది అని అన్నారు. అంటే ఒక పల్లెటూరు విషయం లోనే ఇలా ఉంటె దేశం గురించి ఇంకెంత పెద్దగా ఆలోచించాలి. మన దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి ప్రపంచం లోని ఇతరదేశాలకు రవాణా సౌకర్యం ఉంటేనే పెట్టుబడిదారులు మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు.

బారిస్టర్ పార్వతీశం మాదిరిగా విదేశాలకు వెళ్లాలంటే ఓడలోనే ప్రయాణం చేసి వేళలంటే అది చాలా ఇబ్బంది గా ఉంటుంది, పారిశ్రామికవేత్తలకు సమయం చాల వృధా అవుతుంది. కాబట్టి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్, డైరెక్ట్ ఫ్లైట్స్ వంటివి ఉంటేనే ఆయా రాష్ట్రాలపై విదేశీయుల కన్ను పడుతుంది. వీతిథితోపాటు నీటి వనరులు, నిరంతరాయంగా విద్యుత్ సౌకర్యం. అదే విషంగా విశాలమైన పోర్టులు. ఇవన్నీ కూడా చాలా కీలకమైనవి.

భారత దేశానికి ఉన్న సౌకర్యంలో విశాలమైన పోర్టులు కూడాఒకటి. ముంబై, , విశాఖ, చెన్నై, వంటి మెగా పోర్టులు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి మాత్రమే కాక అనేక పోర్టులను భారత ప్రభుత్వం కొత్తగా నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు సహకారం అందిస్తోంది.

సేవా రంగం.ఇది చాలా కీలకం

భారతదేశం ఆర్ధికంగా అభివృద్ధి సాధించడానికి మరో ముఖ్యమైన కారణం సేవా రంగం. ఈ సేవా రంగంలో అనేక దేశాలు భారత దేశానికి వచ్చి పెట్టుబడులు పెట్టాయి. ముఖ్యంగా ఏ సేవా రంగం 1999 నుండి మొదలు పెడితే 2004 నుండి వృద్ధి లోకి రావడం మొదలయింది.

సేవారంగం అని చెప్పడం కన్నా సాఫ్ట్ వేర్ రంగం అని చెప్తే ఎక్కువ మందికి అర్ధం అవుతుంది. ఈ సాఫ్ట్ వేర్ రంగం భారత దేశంలోకి అడుగుపెట్టాక దేశంలో పెట్టుబడులు పెరగడమే కాదు, మన దేశ పౌరులకు మంచి ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయి, అరకొరగా ఉండే జీతాల నుండి ఐదంకెల జీతం వరకు తీసుకుని ఆనందకరమైన జీవితం గడిపే స్థాయికి తీసుకురావడానికి దోహదపడ్డాయి.

పైగా వారు సంపాదించినా డబ్బును భూమిపై పెట్టుబడులు పెట్టడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం కూడా బాగా వృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. పెరుగుతున్న దేశ జనాభాను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాపారరంగంలో పెట్టుబడి పెట్టిన వారు ఊహించని రీతిలో లాభాలను పొందగలిగారు. కాబట్టి రిజిస్ట్రేషన్ల రూపంలో కూడా దేశ ఖజానాకు సొమ్ము చేకూరింది అని చెప్పొచ్చు.

సంక్షేమ పధకాలు :

సంక్షేమ పధకాలు ఎల్లప్పుడూ ప్రజల ఆర్ధిక వృద్ధికి తోడ్పడే విధంగా ఉండాలి కానీ వారిని సోమరిపోతులను చేసే విధంగా ఉండకూడదు. ఇదే సంక్షేమ పధకాల ముఖ్య ఉద్దేశం.

ప్రతుతం చుస్తే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకాలు దేశంలోని పేదల జీవన స్థాయిని మెరుగుపరచడంలో సహాయపడ్డాయి అని చెప్పొచ్చు. ఎప్పుడైతే పేద ప్రజలు ఒక మెట్టు ఎదిగేందుకు ఈ సంక్షేమ పధకాలు ఉపయోగపడ్డాయో అది వారి ఎదుగుదలకు ఖచ్చితంగా దోహదపడతాయి.

దాని వల్ల దేశానికి ఖచ్చితమైన వృద్ధి కనిపిస్తుంది. ఉదాహరణకు ఒక పేద ఇంటి విద్యార్థిని సంక్షేమ పధకం ద్వారా చదువుకునే అవకాశాన్ని కల్పించినప్పుడు ఆ విద్యార్థి దానికి సద్వినియోగం చేసుకుంటే, మంచి చదువు పూర్తి చేసి గొప్ప ఉద్యోగం సాధించవచ్చు.

దానివల్ల ఆ కుంటుంబం పేదరికం నుండి బయటపడుతుంది. భారతదేశంలో ఇలా సంక్షేమ పధకాలను ఉపయోగించుకుని వృద్ధిలోకి వచ్చిన కుటుంబాలు లక్షల్లో ఉన్నట్టు నీతి ఆయోగ్ ద్వారా తెలుస్తోంది.

10 ట్రిలియన్ డాలర్ల వృద్ధి ఇప్పటికంటే.

భారతీయ జనతా పార్టీ తుది జాబితాను విడుదల చేసిన నేతలు 23 Indian 5 Trillion dollar economy : భారత దేశ ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ సమీప భవిష్యత్తులో 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. అది అంత తేలికైన విషయమా?

2014 నుండి 2023 మధ్య కాలంలో అంటే 10 సంవత్సరాల కాలంలో 4 ట్రిలియన్ల ఆర్ధిక వృద్ధి లోకి భారతదేశాన్ని తీసుకురాగలిగామంటే 10 ట్రిలియన్ల ఆర్ధిక వృద్ధిలోకి దేశాన్ని తీసుకురావడం కష్టతరమైన పని కాదని వారు భావిస్తున్నారు. అందుకే వీటన్నిటిలో దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత లక్ష్యంగా భారతదేశం 5ట్రిలియన్ల ఆర్ధిక వృద్ధిని సాధించే దిశగా పనిచేస్తోంది.

పెరుగుతున్న వేగాన్ని బట్టి భారతదేశం తన ఆర్థిక వ్యవస్థకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒక ట్రిలియన్ డాలర్ల అభివ్రుధిని జోడించడానికి వీలుంటుంది అని అంచనా వేస్తున్నారు. ఇదే గనుక జరిగితే, సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ అంచనా ప్రకారం 2035 నాటికి భారతదేశం పది లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారనుందని అంటున్నారు.

ప్రపంచంలో కొన్ని దేశాలు మాంద్యాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ మాత్రం బ్రైట్ ఫ్యూచర్ వైపే అడుగులు వేస్తూ ముందుకి వెళుతోందని చెబుతున్నారు. మన దేశంలోని దేశంలోని 656 జిల్లాల్లో 84,400 కంటే ఎక్కువ వ్యాపారాలతో భారతదేశం ప్రపంచంలో మూడవ-అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా అవతరించింది. భారతదేశం G20 ప్రెసిడెన్సీని చేజిక్కించుకున్నందున, ప్రపంచానికి తన బలాన్ని ప్రదర్శించడానికి ఉపయోగపడుతుంది.

Leave a Comment