భారత దేశం లోకి అక్రమం గా ప్రవేశించిన వారికి భారత దేశ పౌరసత్వం ఇవ్వడానికి ఎట్టిపరిస్థితుల్లో అది కుదరదు అని కేంద్ర ప్రభుత్వం మరొక సారి ప్రకటించింది. ఇటీవల సుప్రీం కోర్టు అడిగిన ప్రశ్నకు సమాధానం గా పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం రోహింగ్యలకు భారత పౌరసత్వం ఇచ్చే ఉద్దేశ్యం కాని అవకాశం కానీ లేదని స్పష్టం చేసింది కేంద్రం.
అందుకు కారణం కూడా తెలియ చేసింది, భారత్ లోకి ప్రవేశించిన రోహింగ్యా ముస్లిం లతో భారత దేశ అంతర్గత భద్రత కు ముప్పు ఉందని నిఘా వర్గాల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది కేంద్రం తెలిపింది. అంతే కాదు శరణార్ధులు గా భారత దేశం లోకి వచ్చిన అందరికి పౌరసత్వం ఇవ్వలేమని అది అసాధ్యం అని కేంద్ర స్పష్టం చేసింది.
పార్లమెంట్ లో చేసిన చట్ట సవరణ లో న్యాయ వ్యవస్ద జోక్యం చేసుకోకూడదని ఒక అఫిడవిట్ లో తెలిపింది. భారత రాజ్యంగం లో పొందు పరచిన ఆర్టికల్ 21 ప్రకారం భారత దేశం లో విదేశీయులు స్వచ్చగా తిరగడానికి ఉంది అని పేర్కొంది. అలాఅని భారత దేశ పౌరులకు ఉండే అన్ని హక్కులు వారికి కలిపించడం అసాధ్యం అని అందుకు అవకాశం కుడా లేదని కేంద్ర స్పష్టం చేసింది.