Indian navy: భారత నావికా దళం(Indian navy) ఒకో కీలక నిర్ణయం తీసుకుంది. వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్(Very Low Frequency Communication Station) ను తెలంగాణ(Telangana) రాష్ట్రం వికారాబాద్ లో ఏర్పాటుచేయడానికి నిశ్చయించుకుంది.
ఈ క్రమం లోనే వారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని(CM Revanth Reddy) కలుసుకున్నారు. వి.ఎల్.ఎఫ్ అంటే వెరీ లో ఫ్రీక్వెన్సీ అని అర్ధం. ఈ పద్దతిలో జలాంతర్గాములు కొన్ని యుద్ధ నౌకలలో కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక అనేక నౌకలు, సబ్ మెరైన్ లు నావికాదళంతో మాట్లాడేందుకు వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ ఉపయోగించబడతాయి.
ఇక వికారాబాద్(Vikarabad) జిల్లాలోని పూడూరు కి దగ్గరలో ఉన్న దామగూడెం అటవీప్రాంతాన్ని(Damaragudem Reserve Forest) ఎంచుకున్నారు. ఈ అటవీ ప్రాంతంలో 1174 హెక్టార్ల భూమిని కేటాయించగా వాటికి గతంలోనే పర్యావరణం అనుమతులు క్లియరెన్స్ వచ్చినప్పటికీ భూమి కేటాయింపులు మాత్రం జరగలేదు.
ఈ విషయంలో 2010 సంవత్సరం నుండి కూడా నావికాదళం అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వమైన కాంగ్రెస్ సర్కారును సంప్రదిస్తూనే ఉన్నట్టు తెలుస్తోంది.
నేటి కాంగ్రెస్ లో సఫలం : Success in today’s Congress
అయితే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి పెండింగ్ లో ఉన్న వ్యవహారం ఈ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాం లో ఫైనలైజ్ అయింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు కి సంబంధించిన అవరోధాలు తొలగిపోయి అనుమతులు లభించడంతో నేవీ కి సంబంధించిన ఉన్నతాధికారులు కార్తీక్ శంకర్, సర్కిల్ డీఈవో రోహిత్ భూపతి, కెప్టెన్ సందీప్ దాస్ సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు.
వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ సెంటర్ ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది. తెలంగాణ లో ఏర్పాటు చేయబోయేది, దేశంలోని రెండవ వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ సెంటర్. మొదటిది తమిళనాడు రాష్ట్రంలో ఉంది. తమిళనాడులోని తిరునెల్వేలిలో ఆ స్టేషన్ పేరు ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్.
మొదటినుండీ అడ్డంకులే : Obstacles from the beginning
దామరగూడెంలో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్‌ను ఏర్పాటు చేసే విషయంలో కొన్ని అవరోధాలు కూడా ఎదురయ్యాయి. దామగూడెం ఫారెస్ట్ ప్రోటెక్షన్ ఈ వ్యవహారంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ ప్రాజెక్టు ను రద్దు చేయాలనీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.
ఇక ఈ కేసులో కలుగజేసుకున్న కోర్టు నావికాదళానికి కొన్ని సూచనలు చేస్తూ అనుమతులు మంజూరు చేసింది. ఆ షరతులు ఏమిటంటే, భూమిని కేటాయించిన అటవీ ప్రాంతంలో ఉన్న ఆలయాలకు ఎటువంటి ఇబ్బంది కలిగించరాదని, ఆ ఆలయాలలోనికి ఇతరులను అనుమతించేలా ఉండాలని కోర్టు పేర్కొంది. ఈ షరతులకు నావి అంగీకరించింది.
టౌన్ షిప్ లు కూడా రానున్నాయి : Townships are also coming
ఇక్కడ కేవలం నేవి వి సంబంధించ కార్యాలయమే కాకుండా ఒక టౌన్ షిప్ కూడా భవిష్యత్తులో రూపుదిద్దుకోబోతోంది అంటున్నారు. దానికి కారణం కూడా ఉంది. ఈ నేవి యూనిట్ లో దాదాపు 600 మంది నావికాదళం అధికారులు ఉంటారు.
వారితో పటు సాధారణ పౌరులు కూడా ఉంటారు. సుమారు 3000 వేలమందికి వరకు టౌన్ షిప్ లో ఉండే అవకాశం ఉందట. ప్రాజెక్టు లో భాగంగా దామరగూడెం రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూరా రోడ్డును కూడా నిర్మించటానికి ప్లాన్ చేస్తున్నారు, ఆ రోడ్డు పొడవు 27 కిలోమీటర్లు ఉంటుందని సమాచారం. ఇక ఈ టౌన్ షిప్ లో స్కూళ్ళు, ఆసుపత్రులు, సూపర్ మార్కెట్లు, బ్యాంకులు ఉంటాయట.