IND beat SA in 642 Balls: కేప్‌టౌన్(Cape Town) లో భారత్ దక్షిణాఫ్రికా(South Africa) దేశాల క్రికెట్ జట్లు టెస్ట్ సీరీస్ లో తలపడ్తున్నాయి. ఈ సీరీస్ ను భారత్(India) చాల ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ఈ సీరీస్ లో మొదట పరాజయాన్ని ఎదుర్కొన్నప్పటికీ దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు భారత్ ప్లేయర్లు గట్టి సమాధానమే ఇచ్చారు. భారత్ సేన(Team India) దక్షిణాఫ్రికా ఆటగాళ్లపై విరుచుకుపడింది.
ఏకంగా ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. అంతే కాదు మన టీమ్ ఇండియా ఆటగాళ్లు మరో రికార్డు కూడా సృష్టించారు. అదేమిటంటే టెస్ట్ సీరీస్ ను అత్యంత తక్కువ సమయంలో ముగించేశారు.
భారత్ ఒక మ్యాచ్ ను చేజార్చుకున్నప్పటికీ ఈ గెలుపుతో దానిని సమం చేసింది. భారత ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా(Jaspreet Bumra), మొహమ్మద్ సిరాజ్(Mohammad Siraj) ఇద్దారూ కలిసి ఆటను విజయం వైపు నడిపించారని చెప్పొచ్చు.
వీరిద్దరిలో ఎవరెవరు ఏయే ఇండింగ్స్ లో ఎన్ని వికెట్లు తీశారన్నది చుస్తే, మొదటి ఇండింగ్స్ లో సిరాజ్ ఆరు వికెట్లు తీసి రెచ్చిపోగా, రెండవ ఇండింగ్స్ లో ఒక్క వికెట్ తో సరిపెట్టుకున్నారు.
ఇక బుమ్రా విషయానికి వస్తే మొదటి ఇండింగ్స్ లో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసిన బుమ్రా రెండవ ఇండింగ్స్ లో విజృంభించి ఆడాడు, తన బౌలింగ్ మాయాజాలంతో 6 వికెట్లు పడగొట్టాడు.
టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భారత్ నెంబర్ వన్ – India is number one in Test Championship
దక్షిణాఫ్రికా తో జరిగిన ఈ రెండవ మ్యాచ్ లో భారత్(India) 642 బంతుల్లోనే టెస్ట్ మ్యాచ్ ఫలితాన్ని తేల్చేసింది.
ఇలా తక్కువ బంతుల్లో ఫలితాన్ని తేల్చడం 147 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో(Test Cricket History) ఇదే ప్రధమం అని తెలుస్తోంది.
107 ఓవర్లకె(107 Overs) ఫలితం వచ్చిన ఈ టెస్ట్ మ్యాచ్ లో ఒకటిన్నర రోజు వ్యవధిలో 33 వికెట్లు పడిపోయాయి. ఇక ఈ మ్యాచ్ తరువాత తక్కువ ఓవర్లలో ముగిసిన మ్యాచ్లు ఏమున్నాయి అని ఒక లుక్కేద్దాం.
భారత్- సౌత్ ఆఫ్రికా తరువాత ఆ స్థానంలో ఆస్ట్రేలియా(Australia) – సౌత్ ఆఫ్రికా జట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్ 656 బంతుల్లో ముగిసింది.
ఆతరువాతి స్థానంలో వెస్టిండీస్(West indies) – ఇంగ్లాండ్(Ingland) టెస్ట్ మ్యాచ్ 672 బంతుల్లో ముగిసింది. ఆతరువాత ఇంగ్లాండ్ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ ను 788 బంతులకు ముగించారు.
ఇక ఈ మ్యాచ్ తో భారత్ మరో ఘనత కూడా సాధించింది. డబ్ల్యుటిసి(WTC) అంటే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో భారత్ అగ్ర స్థానాన్ని కూడా దక్కించుకుంది.
మొదటి స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా ను కిందికి నెట్టి రోహిత్ సేన 54.16 పాయింట్లతో మొదటి స్థానాన్ని కైవశం చేసుకుంది.