PM Modi Lakshadeweep Visit: ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అందమైన దీవులు మనకు దర్శనమిస్తాయి. అవి ఎంతో అందంగా ఉండడంతో పాటు వాటిని చూడడానికి వెళ్లిన టూరిస్టులకు ఎంతో ఆనందాన్ని పంచుతాయి.
అందుకే ప్రపంచవ్యాప్తంగా టూరిజానికి డిమాండ్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే భారత ప్రధానమంత్రిని నరేంద్ర మోదీ భారతదేశంలో ఉన్న దీవులను ప్రమోట్ చేయడంలో బిజీ(busy) అయిపోయారు.
For those who wish to embrace the adventurer in them, Lakshadweep has to be on your list.
— Narendra Modi (@narendramodi) January 4, 2024
During my stay, I also tried snorkelling – what an exhilarating experience it was! pic.twitter.com/rikUTGlFN7
అనగానే భారతీయులందరికి గుర్తుకొచ్చేవి మాల్దీవులు. వీటిని చూడడానికి భారతదేశం నుండి చాలా ప్రాంతాల వారు తరలి వెళుతుంటారు. కానీ, ఈసారి మోదీ జీ చూపులు లక్ష దీవుల(Lakshadweep) వైపు చూసాయి.
ఈ సందర్భంగాకేంద్రపాలిత ప్రాంతం అయిన లక్షద్వీప్ లో పర్యటించి, అక్కడ ఏర్పాటు చేసిన సభలలో అక్కడ ప్రజల మంచి హృదయాలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఆ తరువాత అక్కడ ఉన్న అందమైన బీచ్ లను సందర్శించి ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంతో ఫోటోలనుదిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Recently, I had the opportunity to be among the people of Lakshadweep. I am still in awe of the stunning beauty of its islands and the incredible warmth of its people. I had the opportunity to interact with people in Agatti, Bangaram and Kavaratti. I thank the people of the… pic.twitter.com/tYW5Cvgi8N
— Narendra Modi (@narendramodi) January 4, 2024
లక్షద్వీప్(Lakshadweep)ప్రజల మధ్య ఉండే అవకాశం నాకు వచ్చిందని, ఈ ద్వీపాలు ఎంతో అద్భుతాలకి నిలయాలని పీఎం modi పేర్కొన్నారు.
లక్ష దీవుల ప్రజలు ప్రేమ తో అందించిన ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపారు. అందమైన ప్రకృతిని చూడడానికి తెల్లవారుజామునే బీచ్ ల వెంట పాయనాన్ని కొనసాగించానని,
ఈ నా ప్రయాణం నా మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చిందని పీఎం మోదీ తన ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. అంతేకాదు మోదీజీ స్నోర్ కెల్లింగ్తో పాటు సముద్రం ఒడ్డున ఒక బుక్ ను చదువుతూ గడిపేశారు.