హైదరాబాద్ నగర పౌరులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్

website 6tvnews template 2024 03 05T140303.343 హైదరాబాద్ నగర పౌరులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్

హైదారాబాద్ నగర ప్రజలు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఆ ఘడియలు ఇప్పుడు వచ్చేసాయి. అదే లింగంపల్లి – ఘటకేసర్ MMTS సర్వీసులు ఈరోజు నుండి ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి. అంతకు ముందు పటాన్ చేరు లో కుడా కొన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. వాటిలో ఈ MMTS సర్వీసులు కూడా ఉన్నాయి.

ఈ సర్వీసులు వల్ల IT ఉద్యోగుల తో పాటు దురాలనుండి సిటీ లో కి వచ్చేవారికి ప్రయాణం సులభం గాను, సౌకర్య వంతం గాను ఉంటుంది. ఈ సర్వీసులు వల్ల నగరం లో తూర్పు – పడమర IT కారిడార్లు కలుపుతూ ఉండడం వల్ల ఈ లింగం పల్లి – ఘటకేసర్ ల మద్య MMTS సర్వీసులు పరుగులు పెట్టనుంది.

ఈ MMTS ట్రైన్ లు లింగం పల్లి -సనత్ నగర్ – మౌలాలి – చర్ల పల్లి – ఘట కేసర్ ఈ స్టేషన్ లను కలుపుతూ వెళ్తుంది. ఈ ట్రైన్ టిక్కెట్ ధర అందరికి అందుబాటు లో ఉండే విధం గా 5 రూపాయలు గా నిర్ణయించారు. మొత్తానికి ఈ MMTS ట్రైను నిత్యం 11 స్టేషన్ లను కలుపుకుంటూ తిరుగుతు ఉంటుంది.

Leave a Comment