Indian railway warning to its Passenger : రైల్వే అధికారుల హెచ్చరిక రైలులో టపాసులు తీసుకువెలితే జరిమానా ఎంత అంటే.
దీపావళి పండుగ వచ్చిందంటే చాలు చిన్న పెద్ద తేడా లేకుండా అంతా ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబ సమేతంగా బాణా సంచా కాల్చడానికి సిద్ధమవుతారు.
ఒక వేళ తమ సొంత ఊళ్ళకు దూరంగా ఉంటే గనుక పండుగ రోజుకి ఇంటికి వెళ్ళి వాలిపోయేలా ప్లాన్ చేసుకుంటారు. గట్టిగా ఒక రెండు మూడు రోజులు ఇంటిదగ్గరే ఉంది తనివితీరా సెలవులను ఆస్వాదించాలని అనుకుంటారు.
అయితే దీపావళి పండుగ అంటే టపాసుల పండుగ కాబట్టు వెళుతూ వెళుతూ తక్కువ రేట్లకు మందుగుండు సామగ్రి దొరికితే తీసుకువెళదామని భావిస్తారు. అలా ప్లాన్ చేసుకునే వారికోసమే ఈ న్యూస్.
తెలుగు రాష్ట్రాలలో ఉండే వారు హైదరాబాద్, ముంబై, పూణే, బాణగుళూరు, చెన్నై వంటి ప్రాంతరాల్లో ఉద్యోగాలు చేసే వారు ఉంటారు. వారు దీపావళికి తమ స్వగ్రామలకు వెళ్లాడలుచుకుంటే తమ లాగేజ్ లో దీపావళి సామాగ్రి లేకుండా జాగ్రత్త పదండి.
ముఖ్యంగా రైలులో ప్రయాణం చేసేవారు ఎక్కువ జాగ్రత్త తీసుకుకోవాలి.ఎందుకంటే రైలులో పేలుడు పదార్ధాలు కానీ, మందుగుండు సామాగ్రిని గాని తీసుకువెళ్లడం చట్టరీత్యా నేరం.
దీనిని అతిక్ర మించిన వారికి రైల్వే చట్టం 1989 సెక్షన్ 164, 165 ప్రకారం, 1000 రూపాయలు జరిమానా లేదంటే మూడేళ్ళ జైలు శిక్ష విధించబడుతుంది.
కొన్ని సందర్భాలలో నేరం తీవ్రంగా ఉంటే జరిమానా, జైలు శిక్ష రెండు కూడా విధించే అవకాశం కూడా ఉందని అంటున్నారు అధికారులు. రైల్వే వారు ఇలా కఠినంగా వ్యవహరిచడానికి కారణం కూడా లేకపోలేదు.
గతంలో తమిళనాడులో ఓ టూరిస్టు ట్రైన్‌లో గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది. అందుకే రైల్వే అధికారులు చట్టాలను మరింత కఠినతరం చేస్తున్నారు.
ఇక మరి వైపు ప్రయనుకులకు కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు. రైలులో ప్రయాణించే సమయంలో ఎవరైనా రైల్వే స్టేషన్ కి గాని రైలులోకి గాని పేలుడు పదార్ధాలు, మందుగుండు సామగ్రిని తీసుకువచ్చినట్టు గుర్తిస్తే వెంటనే 139 అనే హెల్ప్ లైన్ నెంబర్ కు సమాచారం అందించాలని అంటున్నారు.
ఇలా చేయడం వల్ల ప్రమాదాన్ని నిలువరించి సురక్షిత మైన ప్రయాణం చేయవచ్చని అంటున్నారు. కాబట్టి రైలులో వెళ్ళేవారు ఇక మీదట ఈ తరహా వస్తువులను తీసుకువెళ్ళే ఉద్దేశం ఉంటే వాటిని తప్పకుండా పక్కన పెట్టేయాల్సిందే.