ప్రపంచంలోనే టేస్టీ స్వీట్స్ కి సంబందించి ఒక జాబితా విడుదల చేసింది అంతర్జాతీయ ఫుడ్ గైడ్ సంస్థ అయిన టేస్ట్ అట్లాస్. ఇందులో మనదేశానికే చెందిన ఒక టేస్టీ స్వీట్ రసమలై కు రెండో స్థానం దక్కింది. దీనిని భోజనం సమయంలో తీసుకునే స్వీట్ల ఆధారం గా ఈ లిస్టు ని తయారుచేసారు.
ఈ రసమలై స్వీట్ బెంగాల్ రాష్ట్రం కి చెందిన ప్రజలంతా ఎంతో అమితం గా ఇష్ట పడే స్వీట్ అని చెప్తారు. మనం బెంగాల్ రాష్ట్రం లో ఏ ప్రదేశానికి వెళ్లినా రసమలై స్వీట్ అందరిని నోరూరిస్తూ ఆహ్వానం స్వాగతం పలుకుతు ఉంటుంది. ఈ స్వీట్ తయారీలో ప్రధానంగా పాలు, చక్కెర, కుంకుమపువ్వు, నిమ్మరసం ఇవన్ని కలిపి ఈ రసమలై స్వీట్ వాడకం లో ఉపయోగిస్తారు.
ఈ టేస్టీ స్వీట్స్ లిస్టులో పోలెండ్ కి చెందిన స్వీట్ సెర్నిక్ అనే స్వీట్ నెంబర్ వన్ గా స్వీట్ గా ప్రకటించారు. ఈ సెర్నిక్ స్వీట్ కి కోడిగుడ్లు, చక్కెర ఉపయోగిస్తారు. ఈ సెర్నిక్ కూడా ఒక రకమైన చీజ్ వంటి పదార్ధం అయిన డిజర్ట్ తో పోలుస్తారు. ఈ టేస్ట్ అట్లాస్ సంస్ద రూపొందించిన టాప్-10 స్వీట్స్ జాబితా లో మొదటి స్దానం సెర్నిక్ స్వీట్ కి లభించగా, మన భారత దేశానికి చెంది రసమలై స్వీట్ రెండో స్దానం దక్కింది.
ఇక వరుసగా గ్రీస్ దేశానికి చెందిన స్ఫకియానోపిటా, మెలోపిటా చీజ్, అమెరికా కు చెందిన న్యూయార్క్ చీజ్, జపాన్ దేశానికి జపనీస్ చీజ్, స్పెయిన్ కి చెంది బాస్క్ చీజ్, హంగేరీ దేశానికి చెందిన రాకోజీ టురోస్, జర్మనీ చెందిన కసెకుచెన్ , చెక్ రిపబ్లిక్ కు చెందిన మిసారెజీ స్వీట్లు తర్వాతి స్దానాలు నిలిచాయి.