Indian Students Has Pushed Back China : ఆ విషయంలో చైనాను వెనక్కి నెట్టిన భారత్.. ఏటా ఎంత మంది విద్యార్థులు అమెరికా వెళుతున్నారంటే.

Add a heading 15 Indian Students Has Pushed Back China : ఆ విషయంలో చైనాను వెనక్కి నెట్టిన భారత్.. ఏటా ఎంత మంది విద్యార్థులు అమెరికా వెళుతున్నారంటే.

Indian Students Has Pushed Back China : ఆ విషయంలో చైనాను వెనక్కి నెట్టిన భారత్.. ఏటా ఎంత మంది విద్యార్థులు అమెరికా వెళుతున్నారంటే. అమెరికా లో అంత మంది భారత విద్యార్థులు ఉన్నారా..

భారత దేశం ఈ మధ్య కాలంలో చైనాను ఒక విషయంలో పోటీ పడి వెనక్కి నెట్టింది, అదే దేశ జనాభా, ప్రస్తుతం భారత దేశ జనాభా చైనా దేశ జనాభా కన్నా ఎక్కువే. అది ఒక విధంగా విచారించదగ్గ విషయం అయితే, ఒక విధంగా మంచి విషయం. ఎందుకంటే భారత్ లో పెరిగిన జనాభాలో యువతే ఎక్కువ మంది ఉన్నట్టు తెలుస్తోంది. దేశంలో యువత ఎక్కువగా ఉన్నప్పుడు వారిని సన్మార్గంలో నడిపించుకుని ఉపాధి కల్పిస్తే దేశాభివృద్ధికి బాటలు వేసుకోవచ్చు.

ఈ విషయాన్నీ పక్కన పెడితే ఇప్పుడు మన భారత దేశం మరో విషయంలో చైనాను మించిపోయింది. అదేమిటంటే అమెరికాకి వెళ్లి చదువుకునే వారి అంశంలో. భారత దేశం నుండి ప్రతి ఏటా అమెరికా వెళ్లి చదువుకునే విద్యార్థుల సంఖ్యా కన్నా చైనా నుండి అమెరికా వెళ్లి చదువుకునే వారి సంఖ్యా ఎక్కువగా ఉండేది. కానీ ఈ ఏడాది ఆ డిజిట్ ను ఇండియా క్రాస్ చేసేసింది. చైనా ను బీట్ చేసి ఇండియా ముందుకు వెళ్ళింది.

గడిచిన మూడేళ్ళలో చూస్తే ఉన్నత విద్యాకోసం అమెరికా వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఓపెన్ డోర్స్ అనే సంస్థ అందించిన సంఖ్య ప్రకారం, 2022-2023 సంవత్సర కాలంలో చూసుకుంటే అమెరికా వెళ్తున్న భారత విద్యార్థుల సంఖ్య 268,923కి చేరుకున్నట్టు తెలుస్తోంది. 2009/10 సమయంలో డ్రాగన్ దేశాన్ని భారత్ అధిగమించింది, ఆ తర్వాత ఈ విషయంలో మరలా ఇప్పుడు చైనాను భారత్ వెనట్టి నెట్టింది. 2022-23లో అమెరికా వెళ్లిన భారత గ్రాడ్యుయేట్ల సంఖ్య 63 శాతం పెరిగి 165,936కు చేరుకుంది.

అగ్రరాజ్యం అమెరికాలో సుమారు 10 లక్షల మంది వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటూ ఉంటె వారిలో 2.5 శాతం మంది భారతీయ విద్యార్థులే ఉన్నట్టు గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఈ ఎదుగుదల కేవలం డ్రాడ్యుయేట్ల విషయంలోనే కాక అండర్ గ్రాడ్యుయేట్ల విషయంలో కూడా పెరిగిందని అంటున్నారు. అమెరికాలో చేదువుకునేందుకు ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు ఆశక్తి చూపెడుతున్నారు. వారిలో కొందరు వీసా సమస్యల కారణంగా విదేశీ విమానం ఎక్కలేకపోతున్నారు.

మరోవైపు చైనా విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2022-2023 సంవత్సరానికి గాను 2,90,000 మంది చైనా విద్యార్థులు అమెరికాకు విద్య కోసం వెళ్లినట్టు తెలుస్తోంది. కానీ అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు ఉండటం, యూకే కెనడా యూనివర్సిటీల నుండి పోటీ ఉండటంతో చైనా విద్యార్థులు అమెరికా విమానం ఎక్కేందుకు మొగ్గుచూపడం లేదు.

Leave a Comment