ఉమెన్స్ డే రోజున ఇన్ఫోసిస్ సుధామూర్తి కి దక్కిన గౌరవం

ocgeavi4 sudha murty 625x300 14 December 22 ఉమెన్స్ డే రోజున ఇన్ఫోసిస్ సుధామూర్తి కి దక్కిన గౌరవం

భారత ప్రధాని మోడీ ఉమెన్స్ డే పునస్కరించుకుని భారతీయ విద్యా వేత్త, రచయిత్రి ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి భార్య అయిన సుధా మూర్తి కి రాజ్య సభ కు నామినేట్ చేస్తునట్లు ప్రకటించారు. ఈ వార్తను ఆయన X లో పోస్ట్ చెయ్యడం జరిగింది. అలాగే భారత రాష్ట్రపతి నన్ను రాజ్యసభ కు నామినేట్ చేయడం సంతోషం గా ఉందని ఆవిడ అన్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను రాజ్యసభ కు నామినేట్ చెయ్యడం అనేది జరిగేదే.

కాని సుదాముర్తి లాంటి వ్యక్తులు చేసిన సేవలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఆవిడ చేసే సమాజ సేవలు అందరికి స్పూర్తిదాయకం అని ప్రధాని మోడీ X లో ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ కు సుదాముర్తి స్పందిస్తూ ” నిజం గా నాకు పెద్ద మహిళా దినోత్సవం ” అంటూ ఆవిడ ప్రధాని మోడీ కి కృతజ్ఞతలు తెలియచేసారు. కర్ణాటకలోని 1950 ఆగస్టు 19న సుధామూర్తి జన్మించారు. ఈవిడ టాటా కి
టెల్కో లో కంప్యూటర్ సైంటిస్ట్ గా ఇంజినీర్ గా నియమింపబడ్డ తొలి మహిళా ఇంజినీర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఉద్యోగం చేస్తూనే పేదరికం, పారిశుద్ధ్యం, ఆరోగ్య సమస్యల ను పరిష్కరించడం వల్ల ఆమెకు పద్మ భూషణ్ అవార్డు తో భారత ప్రభుత్వం ఆమెను సత్కరించడం జరిగింది. ఆవిడ నెలకొల్పిన ఫౌండషన్ ద్వారా వేలాది ఇళ్ళు కట్టడం, స్కూల్స్ లో లైబ్రేరి లను ఏర్పాటు, అలాగే అవసరమైన చోట పబ్లిక్ టాయిలెట్ ల నిర్మాణం కోసం కావలసిన నిధులు సమకూర్చడం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఎన్నెన్నో. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున సుదాముర్తిని రాజ్యసభకు నామినేట్ చెయ్యడం అనేది దేశ భవిష్యత్ లో మహిళల పాత్ర వారి సామర్ధ్యానికి నిలువెత్తు నిదర్సనానికి ఇది ఒక మంచి ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.

Leave a Comment