Republic Day Jan 2024: 2024 రిపబ్లిక్ డే సందర్భంగా ముఖ్యఅతిథిగా ఫ్రెంచ్ అధ్యక్షుడు కి ఆహ్వానం.
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా, ఫ్రాన్స్ అధ్యక్షుడైన EMMANUEL MACRON ని ముఖ్య అతిథిగా భారతదేశానికి ఆహ్వానించనున్నట్టు సమాచారం.
ఇప్పటికీ ఇది 6వ సారి:
భారత రాజధానిలో జరిగే ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షులు అతిథులుగా రావడం. ఈ MACRON కి ముందు,
మాజీ ప్రధాని జాక్వెస్ చిరాక్ 1976 లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యాడు, మళ్ళీ అతనే 1998 లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకి హాజరయ్యాడు.
వాలెరీ గిస్కార్డ్ డి’ఎస్టేయింగ్, భారతదేశానికి గౌరవ అతిథిగా 1980 లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకి హాజరయ్యారు.నికోలస్ సర్కోజి , 2008 లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశానికి వచ్చారు.
ఫ్రాంకోయిస్ హోలాండ్, భారతదేశానికి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అతిథిగా 2016లో వచ్చారు.
ఇక ఈ వచ్చే ఏడాది EMMANUEL MACRON భారతదేశ అతిథిగా రాబోతున్నాడు.
ఫ్రాన్స్ కి ప్రధాని NARENDRA MODI:
జులైలో జరిగిన బాస్టిల్ డే పరేడ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారతదేశ ప్రధాని NARENDRA MODI వెళ్లారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు అయిన EMMANUEL MACRON గౌరవ అతిథిగా బాస్టిల్ డే వేడుకలకు ప్రధాని NARENDRA MODI ని ఆహ్వానించాడు.
ఇరు దేశాల స్నేహం :
ఈ పర్యటనలు అన్నీ ఇరు దేశాల మద్య సత్సంబందాలు నెలకొల్పేందుకే.భారత్, ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 ఏళ్లు గడిచాయి.
ఈ 25 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ప్రధాని NARENDRA MODI ఫ్రాన్స్ లో పర్యటించాడు.