Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర ప్రతిష్టాపనకు ప్రభాస్ కి ఆహ్వానం.
అయోధ్య నుంచి ఆహ్వానం :
అయోధ్యలో ఈ జనవరి 22న రామమందిర ప్రతిష్టాపన ఘనంగా జరగనుంది.
ఈ వేడుకలో భారత ప్రధాని ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ వేడుకలో గ్రాండ్ టెంపుల్ దగ్గర రామ్ లల్లా విగ్రహాల ప్రతిష్టాపన జరగనుంది.
దీనికోసం దేశవ్యాప్తంగా చాలా మంది ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్ళాయి. అందులో మన టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ PRABHAS ని ఆహ్వానించారు.
ప్రతిష్టాపన రోజు అంటే జనవరి 22, 2024 న కర్ణాటక నుంచి తెప్పించిన రెండు రాళ్ళతో తయారు చేయబడిన మూడు విగ్రహాల్లో ఒకటి మరియు రాజస్థాన్ నుంచి తెప్పించిన మరొక విగ్రహాన్నిమహా దేవాలయ గర్భగుడిలో ప్రతిష్టిస్తారు.
ఈ వేడుకకి అన్నీ వర్గాలకు చెందిన సాదువులు 4000 మంది సాదువులని కూడా ట్రస్ట్ ఆహ్వానించింది. అలాగే ప్రతిష్టాపన కార్యక్రమం రోజు 10,000 – 15,000 మందికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
ట్రస్ట్ ఆహ్వానించిన సెలెబ్రెటీస్:
పాన్ ఇండియా స్టార్లయిన ప్రభాస్ మరియు యశ్ లను ఆహ్వానించారు.బాలీవుడ్ నుంచి రణబీర్ కపూర్, ఆలియా భట్, అజయ్ దేవగన్, సన్నీ డియోల్, టైగర్ ష్రాఫ్ మరియు ఆయుష్మాన్ ఖురానాలను ఆహ్వానించారు.
గతంలో అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, అనుపమ్ ఖేర్, అక్షయ్ కుమార్, రజినికాంత్, సంజయ్ లీలా బన్సాలీ, చిరంజీవి, ధనుష్, రిశబ్ శెట్టి మరియు మోహన్ లాల్ లను కూడా ఆహ్వానించారు.