IPL Auction 2024: ఐపీఎల్ వారి వేలం పాట..మొత్తం ఆటగాళ్లు ఎంతమంది అంటే..
IPL ఈ మాట వింటే చాలు Cricket ప్రాయులకు పండగే, అయితే కామన్ పీపుల్ కి కలగూర గంపలా అనిపించే ఈ IPL Cricket ఫాన్స్ కి మాత్రం మస్త్ మజా ఇస్తుంది. ఈ ఐపీఎల్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తుంటారు.
కేవలం ఈ ఆట మొదలవడం గురించే కాదు, ఆట షురూ చేయడానికి ఆటగాళ్లను వేలం పాటలో కొనుగోలు చేసే దగ్గర నుండే వీరి ఆనందం మొదలవుతుంది.
పాలనా ఫంఛైజీ పాలనా ఆటగాడిని ఇంత పెట్టి కొనుగోలు చేసింది, పాలనా అతగాడిని ఎంత డిమాండ్ ఉంది అనే వార్తలు హల్చల్ చేస్తుంటాయి.
అంతే కాదు ప్రతి ఫ్రాంచైజీలోని ఆటగాళ్ల ఎంపిక పూర్తయ్యాక, ఆ ఆటగాళ్లను బట్టి వారి ఆటతీరును బట్టి ఏ జట్టు గెలుస్తుంది అనే దానిపై జోస్యం చెప్పడం కూడా మొదలేట్టేస్తారు.
ఇదే అదునుగా పందెం రాయళ్ళు కూడా రెచ్చిపోతారు. బెట్టింగ్ బాబులు ఈ ఐపీఎల్ ను బాగానే వాడుకుంటూ నాలుగు రాళ్లు వెనకేసుకుంటూ ఉంటారు. వీరి విషయం కాస్త పక్కన పెడితే 2024 season will be held on December 19 in Dubai.
All set for IPL Auction:
IPL వేలం కార్యక్రమానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ వేలం పాటలో మొత్తం 10 ఫ్రాంచైజీలు పాల్గొంటాయని తెలుస్తోంది.
మొత్తం 333 మంది ఆటగాళ్లు ఐపీఎల్ వేలంలో ఉంటారు, ఆ ఆటగాళ్ల నుంచి తమకు కావాల్సిన వాళ్లను సదరు 10 ఫ్రాంచైజీలు వేలం పాట ద్వారానే కొనుగోలు చేసుకుంటాయి.
తమ సత్తా కొద్దీ పాట పాడి తమ జట్టులోకి ఆటగాళ్లను తీసుకుంటాయి, క్రికెట్ లో మెరుగైన ఆటతీరు కనబరిచే ఆటగాళ్లను ఎంచుకుని మరీ దక్కించుకుంటాయి. ఈ వేలం పాటలో కొన్ని విచిత్రాలు జరుగుతాయి.
వేలం పాట అంతా ముగిశాక అసలు ఎవ్వరు కొనలేదు అన్న వారిని ఎదో ఒక జట్టు నామ మాత్రపు ధర చెల్లించి తీసుకుంటుంది, అలాంటి ఆటగాళ్లు తమ సత్తా చాటి ఐపీఎల్ లో హీరోల్లా మారిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి.
అది మాత్రమే కాదు, ఈ IPL లో మంచి ఆటతీరు కనబరిచి ఆతరువాత ఇంటర్నేషనల్ క్రికెట్ లో స్థానం దక్కించుకున్న వారు కూడా ఉన్నారు.
కాబట్టి ఈ IPL Cricket లవర్స్ కె కాదు క్రికెట్ ప్లేయర్స్ కూడా చాలా స్పెషల్, దీని ద్వారా మెరికల్లాంటి ఆటగాళ్ల ను బయటకు తీసుకువస్తున్నారు అనడం లోకూడా సందేహం లేదు.
The person organizes IPL Auction:
ఇక ఈసారి వేలం పాట లో 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల world Cup లో అందరి దృష్టిని ఆకర్షించిన న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర, world Cup ఫైనల్లో సెంచరీతో మెరిసిన ఆసీస్ ఆటగాడు Travis Head,
దక్షిణాఫ్రికా యువ గెరాల్డ్ కోయెట్జీ వంటి వారు వేలంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నారు. ఈ వేలంలో వీరికి మాంచి ధర పలికే అవకాశాలు దండిగా ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో వేలం వేసే వ్యక్తిగా Mallika Sagar వ్యవహరిస్తారని సమాచారం.Mallika Sagar నేతృత్వం లోనే ఇటీవల ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలాన్ని కూడా నిర్వహించారు. IPL ఆట మాత్రమే కాదు దానికి సంబంధించిన వేలాన్ని కూడా ప్రత్యేక్ష ప్రసారం చేయనున్నారు.
ఈ వేలం వేసే ప్రాసెస్ మొత్తం స్టార్ స్పోర్ట్స్ చానల్ తోపాటు, జియో సినిమా ఓటీటీ వేదికలోనూ లైవ్ లో వీక్షించి ఎంజాయ్ చేసేయొచ్చు.
players who quit from IPL Auction:
అయితే ఐపీఎల్ వేలం పాట ప్రారంభం కానున్న తరుణంలో కొన్ని కెలక పరిమాణాలు చోటుచేసుకుంటున్నాయి, ఇంగ్లాండ్ జట్టులోని 19సంవత్సరాల యంగ్ ప్లేయర్, రెహాన్ అహ్మద్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు,
ఇతను Leg spin మాయాజాలం చేయడమే కాదు ఆల్ రౌండర్ కూడా, అయితే ఉన్నట్టుండిఏమైందో కానీ, IPL వేలం నుంచి తన పేరును Rehan వెనక్కి తీసుకున్నాడు.
కేవలం ఇంగ్లాండ్ కి చెందిన రెహాన్ మాత్రమే కాదు, బంగ్లాదేశ్ జట్టు కి చెందిన స్టార్ ప్లేయర్స్, ఫాస్ట్ బౌలర్లు తస్కిన్ Ahmad, Shoriful Islam కూడా IPL వేలం నుంచి బయటకి వచ్చేశారు.
అయితే వీరు ముగ్గురు కూడా వేలం నుండి వైదొలగడానికి కారణం ఏమిటి అనేది మాత్రం వెల్లడించలేదు. అయితే ఈ మినీ వేలంలో పాల్గొంటున్న 10 ఫ్రాంచైజీలు కలిసి భారీ మొత్తంలో ఖర్చు చేయబోతున్నాయి.
వేలంలో ఆటగాళ్లను దక్కించుకోవడానికి కోట్లు కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని బట్టి చుస్తే 10 ఫ్రాంచైజీలు కలిపి 262.5 కోట్ల రూపాయలు ఖర్చుచేయబోతున్నాయట.