మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) బర్త్ డే సందర్భంగా అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు గేమ్ ఛేంజర్ (Gamen Changer)మూవీ మేకర్స్ . సిపిమా నుంచి ఫస్ట్ సాంగ్ ను విడుదల చేశారు. “జరగండి జరగండి జరగండి.. జాబిలమ్మ జాకెట్టేసుకోని వచ్చేసేనండి..”అంటూ సాగే మాస్ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. దుమ్ముదులుపుతోంది.
ఈ పాటకు అనంత్ శ్రీరామ్ (Ananth Sriram) లిరిక్స్ అందించగా థమన్ (Thaman)మాస్ మ్యూజిక్ అందించి ప్రేక్షకులను అలరించాడు. డాలర్ మెహెన్ది (Doller Mehendi), సునిధి చౌహన్ (Sunidhi Chauhan)ఈ పాటను అద్భుతంగా పాడారు. అంతే కాదు ఈ పాటను ప్రభుదేవ (Prabhudeva) కొరియోగ్రాఫ్ చేశారు. ఇదిలా ఉంటే పాట విడుదలైన కొన్ని గంటల్లోనే తమన్ మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. కాపీ సాంగ్ అంటూ నెట్టింట్లో పోస్టులు ప్రత్యక్షమవుతున్నాయి. ఇంతలా నెటిజన్స్ తమన్ ను ఎందుకు ట్రోల్ చస్తున్నారు. అసలు తమన్ ఏ సాంగ్ కాపీ కొట్టాడు? ఇప్పుడు చూద్దాం.
ఎన్టీఆర్ పాట కాపీనా? :
అప్పట్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR)’శక్తి’ (Shakthi) సినిమా చేశాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా ఇలియానా (Ileana)నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఎన్టీఆర్ ఖాతాలో ఫ్లాప్ పడింది. కానీ, ఆ సినిమాలోని పాటలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. శక్తి మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ (Manisarma) అదిరిపోయే మ్యూజిక్ అందించారు. ఈ మూవీలో ని ‘సుర్రో సుర్రు…’ సాంగ్ ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.
అయితే అదే పాటను ఇప్పుడు గేమ్ ఛేంజర్ (Game Changer)మూవీ కోసం తమన్ (Thaman) కాపీ చేశాడని నెట్టింట్లో ట్రోల్స్ ప్రత్యక్షమయ్యాయి. ‘దొరికేశావ్ తమన్! జరగండి పాట ఎక్కడో విన్నట్టు ఉంది అంటూ రెండు పాటల క్లిప్స్ ను సోషల్ మీడియా లో షేర్ చేశారు. దీంతో ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
తమన్‌ను ట్రోల్ చేస్తున్న నెటిజన్స్ :
మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ (Manisharma)దగ్గర తమన్ (Thaman) పని చేశారు. ఆ తర్వాత ఎన్నో సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. తమన్ స్వరపరిచిన ఎన్నో సినిమాల్లో పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. తమిళంలోనూ తమన్ తన సత్తా చూపించాడు. అయితే తమన్ నుంచి కొత్త పాట రిలీజైన ప్రతిసారీ ఇలా సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది కామన్ అయిపోయింది. ఆయన మీద విమర్శలు రావడం సహజంగా మారింది.
అయితే తమన్‌ను ఎందుకు టార్గెట్ చేశారన్నది మాత్రం ఎవరికీ తెలియదు. తమన్ వ్యతిరేకులే కాదు రామ్ చరణ్ (Ram Charan)యాంటీ ఫ్యాన్స్ కూడా ట్రోలింగ్ మొదలు పెట్టారు. చరణ్ స్టైలింగ్, డ్యాన్స్ మీద కూడా యాంటీ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. ఈ క్రమంలో ట్రోలర్స్ సంగతి రేపు చూసుకుందామని మెగా ఫ్యాన్ కూడా స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తున్నారు. మరి, ఈ ట్రోల్స్ మీద తమన్, చరణ్ ఫ్యాన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సిందే.