Super Star Rajinikanth: రేసులో నుంచి సూపర్ స్టార్ పక్కకి జరిగినట్టేనా ?
జైలర్ సినిమాతో హిట్టు కొట్టిన తలైవా, LAL SALAAM తో మళ్ళీ రాబోతున్నాడాని అందరికీ తెలిసిందే.
ఈ సినిమాకి SUPER STAR RAJINIKANTH కూతురు ISHWARYA RAJINIKANTH దర్శకత్వం వహిస్తుంది.
దీనిలో RAJINIKANTH లుక్ చాలా విభిన్నంగా ఉంది. ఇటీవల SUPER STAR RAJINIKANTH BIRTHDAY సంధర్భంగా ఈ సినిమా తాలూకు టీజర్ ని విడుదల చేశారు.
ఇక సినిమా విడుదల విషయానికి వస్తే, 2024 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఇప్పటికే ప్రకటించారు.
విడుదల వాయిదా పడ్డట్టేనా..? :
తలైవా నుంచి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకి నిరాశే మిగిలేలా ఉంది.
ఈ సంక్రాంతికి రానున్న సినిమా విడుదల వాయిదా పడనుందని గాసిప్స్ ఇప్పటికే మొదలయ్యాయి.
ఈ సంక్రాంతికి విడుదల చేసేందుకు చాలా సినిమాలు పోటీ పడుతున్నాయని, పెద్ద పెద్ద స్టార్ ల సినిమాలు పండగ సంధర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు ఇప్పటికే మొదలయ్యాయి.
ఇక అటువంటి సమయంలో LAL SALAAM విడుదల చేస్తే, ఊహించిన స్థాయిలో కలెక్షన్లు రావని చిత్ర బృందం భావించి, విడుదలని వాయిదా వేయనున్నట్టు సమాచారం.
తలైవా కి పోటీ ఎవరు అంటూ నెట్టినట చర్చ నడుస్తుంది, నిజమే కదా సూపర్ స్టార్ కి ఎదురునిలబడే వాళ్ళెవరూ ?ఇక చిత్ర బృందం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో చూడాలి మరి.