ముదిరిన ఇజ్రాయిల్ – గాజా వార్

5 ఫోటో edited ముదిరిన ఇజ్రాయిల్ - గాజా వార్

ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ ల మధ్య వార్ రోజు రోజుకూ ముదురుతోంది. దక్షిణ గాజా స్ట్రిప్ ప్రాంతంలో ఈజిప్ట్ సరిహద్దులో ఉన్న రఫా పట్టణాన్ని ఇజ్రాయిల్ శుక్రవారం పూర్తిగా ఆక్రమించింది. అక్కడ నివాసం ఉండే ప్రజలపై తీవ్ర ఆంక్షలు మొదలయ్యాయి. తాజాగా ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) సెంట్రల్ రఫాలో నివాసం ఉండే ప్రజలను వెంటనే ఖాళీ చేయమని ఆజ్ఞలు జారీ చేసింది. సుమారు రెండు లక్షల జనాభా వుండే ప్రాంతమైన సెంట్రల్ రాఫాలో తాజా ఆంక్షల వల్ల ప్రజలు తరలిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఈజిప్ట్ సరిహద్దు ప్రాంతాన్ని మూసివేసిన ఇజ్రాయిల్ ఆ ప్రాంతంలో భారీ సైనిక చర్యకు దిగుతోంది. శుక్రవారం నాటికి భారీ యుద్ద టాంకులు రఫా పట్టణం చేరుకున్నాయని.. హమాస్ గ్రూపులు ఎక్కువగా చొరబడే ప్రాంతమైన రఫాలో రానున్న కొద్దిరోజుల్లో భారీ యుద్దం ఖాయమని ప్రజలకు ఇజ్రాయిల్ సైన్యం హెచ్చరికలు చేస్తోంది. దీంతో వేలాది మంది ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు.

Leave a Comment