Israel-Hamas: హమాస్ చేతిలో 9 నెల చిన్నారి.. ఓ చేతిలో రైఫిల్‌..చిరునవ్వులు చిందించే చిన్నారిని చూసి కరగని ఉగ్ర గుండె.

srael-Hamas: A 9-month-old baby in the hands of Hamas.. a rifle in one hand

Israel – Hamas : హమాస్ చేతిలో 9 నెల చిన్నారి..చిరునవ్వులు చిందించే చిన్నారిని చూసి కరగని ఉగ్ర గుండె..బందీలైన చిన్నారులు ఎంతమందో తెలుసా..

ముద్దు మొముతో, చిరునవ్వులు చిందిస్తూ, వచ్చీ రాని మాటలతో, ఉయ్యాలలో కేరింతలు కొడుతూ, సందడిగా ఉండే పసి బిడ్డలను చుస్తే ఎంత కోపంలో ఉన్న వారికైనా మూడ్ మారిపోతుంది.

వారి హృదయంలో ఉన్న క్రోధం కరిగి మోముపై చిరునవ్వు మెరుస్తుంది. ఆటవికులైనా, జాలి దయా లేని రాక్షసులైనా చిన్నారుల పట్ల కరుణ, ప్రేమతోనే వ్యవహరిస్తారు. ఈ విషయం మన పురాణాలు కూడా చెబుతున్నాయి. హిరణ్య కశిపుడు భయంకరమైన రాక్షసుడే అయినా తన చేతితో ప్రహ్లాదుడిని

చంపలేకపోయాడు. అందుకే భటులకు ఇచ్చి బలి చేయమని ఆజ్ఞాపిస్తాడు. పురాణాల్లోని రాక్షసులకన్నా కలికాలంలో ఈ తీవ్రవాదులు మరీ కర్కశంగా ఉన్నారు. వారి హృదయం పాషాణంకన్నా దృడంగా ఉందని చెప్పాలేమో. అంత కఠినమైన వ్యాఖ్యలు ఎలా చేస్తారు అని అంటారా ? ఈ వార్త గరించి తెలుసుకుంటే మీరు కూడా ఈ వ్యాఖ్యలతో ఏకీభవిస్తారు.

హమాస్ యోధుల గుండెకు కనికరమనేదే లేదేమో, ఎందుకంటే 9 నెలల చిన్నారి కేఫీర్ బిబాస్ తన నాలుగు సంవత్సరాల అన్నయ్యతో కలిసి తల్లిదండ్రులతో ఇజ్రాయెల్‌లోని కిబ్బట్జ్‌లో నివసించేవాడు.

మోకాళ్లమీద బందాడే ఈ పసి బిడ్డని కూడా కుటుంబంతో సహా హమాస్ మిలిటెంట్లు బందీని చేసేశారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో హమాస్ ఉగ్రమూకలు అనేక మందిని కిడ్నప్ చేశారు.

వారిలో యార్డెన్‌ బిబాస్, అతని భార్య షిరి, వారి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారుల్లో ఒకరి వయస్సు నాలుగేళ్లు కాగా, ఒకరి వయస్సు 9 నెలలు మాత్రమే. కిడ్నప్ అయ్యే నాటికీ 9 నెల వయసున్న కేఫీర్ బిబాస్ కి ఇప్పుడు 10 నెలల వయసు, ఎందుకంటే వారిని కిడ్నప్ చేసి నెల రోజులు గడిచిపోతోంది.

కేఫీర్ తాతయ్య ఎలి బిబాస్ తన కుమారుడి కుటుంబం గురించి తల్లడిల్లిపోతున్నారు. మిలిటెంట్ల చేతిలో బందీగా ఉన్న తన కుమారుడి కుటుంబం ఏ పరిస్థితుల్లో ఉందొ అర్ధం కాక అల్లాడిపోతున్నారు. ఇద్దరు మనవళ్ల కోసం ముదిమి వయసులో ఉన్న ఆయన వెయ్యి కళతో ఎదురుచూస్తున్నాడు.

తన కొడుకు కోడలు ఇద్దరు మనవాళ్ళు క్షేమంగా ఇంటిని తిరిగి రావాలని స్వేచ్ఛ వెలుగులు వారిపై ప్రసరించాలని కోరుకుంటున్నాడు. తన మనవాళ్లతో మునుపటిలాగే ఆనందంగా గడపాలని కలలుకంటున్నాడు.

తన కుమారుడి కుటుంబం కిడ్నప్ కి గురయ్యాక ఎలి బిబాస్ ఒక వీడియోను రిలీజ్ చేశాడు. అందులో అతని కోడలు షిరి తన ఇద్దరు మనవళ్లను ఒడిలో కూర్చోబెట్టుకుని ఉండటాన్ని చూడొచ్చు. అయితే ఆ ఫోటో లో తన కోడలు భయం ఇంకా నిస్సహాయతతో ఉందని ఎలి బిబాస్ బాధాతప్త హృదయంతో చెప్పాడు.

హమాస్ మిలిటెంట్ల చేతిలో ఎలి బీబాస్ కుటుంబమే కాక అనేకమంది బదిలీ ఉన్నారు. వీరి చేతుల్లో కేఫీర్ బిబాస్ ఇంకా తన నాలుగేళ్ల అన్నయ మాత్రమే కాదు, వీరితో కలుపుకుని చుస్తే మొత్తం 32 మంది చిన్నారులు సహా 240 మంది బందీగా ఉన్నారు.

అయితే గత నెల రోజులుగా వీరి గురించి ఎటువంటి జాడా తెలియడం లేదు. ఎటువంటి వార్త వెలువడటం లేదు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత అనేక ఇల్లు నేలమట్టమయ్యాయి. ఈ రెండు దేశాల్లో జరిగిన ప్రాణ నష్టం హృదయవిదారకంగా ఉంది.

హమాస్‌పై ఇజ్రాయెల్ నిరంతరం దాడులు చేస్తోంది. హమాస్‌ను నిర్మూలించే వరకు ఈ యుద్ధం కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెబుతున్నారు.

Leave a Comment